English   

కష్టాల సుడిగుండంలో యంగ్ హీరో సినిమా

arjun
2019-04-25 20:55:02

యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న అర్జున్‌ సురవరం సినిమాకు బాలారిష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్‌ విషయంలో ఎదురైన సమస్యల వలన ఒకసారి రిలీజ్ వాయిదా వేసుకున్న ఎ సినిమా ఎలాగో మళ్ళీ రిలీజ్ కి సిద్దం అయ్యింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా మళ్ళీ వాయిదా పడినట్టు చెబుతున్నారు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన సినిమా యూనిట్ అందుకు తగ్గట్టు ప్రమోషన్‌స్ కూడా ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అర్జున్‌ సురవరం వాయిదా పడిందట నిజానికి ఈరోజు జరగాల్సిన ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్టుగా ప్రకటించింది సినిమా యూనిట్. వాయిదాకు యూనిట్ ఆయితే ఏవీ కారణాలు వెల్లడించకపోయినా థియేటర్ల సమస్యే సినిమాని వాయిదా పడేలా చేసిందని టాక్. ఎందుకంటే ఇప్పటికే థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఆ సినిమాలు తీసేసి ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వడం కష్టమే అదీ కాక అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ సినిమా కూడా రేపు రిలీజ్ కావాల్సి ఉండడం, దానికి బాహుబలి అంత క్రేజ్ రావడంతో రిలీజ్ వాయిదా వేయటమే బెటర్‌ అని భావిస్తున్నారట మేకర్స్. ప్రస్తుతానికి సినిమా రిలీజ్‌ వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించకపోయిన వాయిదా పడటం లాంచనమే అన్న ప్రచారం జరుగుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.

More Related Stories