English   

ఎన్టీఆర్ గురించి ఆసక్తికర అంశం పంచుకున్న వైజయంతీ మూవీస్

 Ashwini Dutt
2020-05-28 16:10:40

ఆంధ్రుల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 97 జయంతి . ప్రతి సంవత్సరం ఆయన కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళి అర్పించడం అనవాయితీ. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంటి వద్దే తాతకి నివాళి అర్పించనున్నారు. ఇక బాలకృష్ణ పురందరేశ్వరి దంపతులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు విజయవాడలో టీడీపీ మహానాడులో దివంగత నేతకు నివాళులర్పించనున్నారు. అయితే తమ సంస్థ ఏర్పాటుకు మూల కారణం అని చెప్పుకునే వైజయంతి సంస్థ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో ర్లీజ్ చేసింది. 

వైజ‌యంతీ మూవీస్ ప్రయాణం, ప్ర‌స్థానం, సాధించిన విజ‌యాలు.. వీటిలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో కీల‌కమని వైజ‌యంతీ మూవీస్‌ కి నామ‌క‌ర‌ణం చేసింది కూడా ఆ పెద్దాయ‌నే అని రాజేంద్ర ప్రసాద్ వాయిస్ తో ఆ వీడియో మొదలవుతుంది. ఎన్టీఆర్‌ తో ఎదురు లేని మ‌నిషి తీస్తున్నప్పుడు ద‌త్ వ‌య‌సు 24 ఏళ్లు మాత్రమేననీ కానీ ఓ రోజు ద‌త్ సెట్ కి వెళ్తే.. కుర్చీలో కూర్చున్న ఎన్టీఆర్ అమాంతం లేచి, అశ్వనీ ద‌త్‌ కి అభివాదం చేశారని ఆ ప‌రిణామానికి షాకయిన అశ్విని దత్ అదేంటి అన్నగారు నను చూసి మీరు లేచి రావ‌డమేమిటని ఆశ్చర్య‌పోతే ఈ సినిమాకి నిర్మాత మీరు, అంద‌రికీ అన్నం పెట్టేది మీరు. మీ వ‌ల్లే మాకు ప‌ని దొరికింది. అలాంటి మీకు గౌర‌వం ఇవ్వాల్సిందే. సెట్లో నేనే మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోక‌పోతే.. ఎవ‌రు ప‌ట్టించుకుంటారు” అంటూ ఎద‌రు ప్ర‌శ్నించారట ఎన్టీఆర్‌. అదీ.. నిర్మాత‌ల ప‌ట్ల ఆయ‌న‌కున్న గౌర‌వ భావమని చెబుతూ ఆ మహానుభావుడు పుట్టిన గడ్డ మీద పుట్టిన గడ్డ మీద పుట్టిన్నందుకు సంతోషిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ ఆ వీడియోలో పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరులోనే జన్మించారు. అది కూడా ఎన్టీఆర్ ఇంట్లోనే. 

More Related Stories