English   

ఎన్టీఆర్ కోసం అశ్వనీదత్ సూపర్ స్కెచ్

NTR-Ashwini-Dutt

యంగ్ టైగర్ ఎన్టీఆర్, అశ్వనీదత్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న మాట. ఈ విషయాన్ని నిర్మాతే స్వయంగా చెప్పాడు కాబట్టి.. నిజమే అనుకోవచ్చు. కాకపోతే మరి దర్శకుడెవరు..? ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది.. ఎలాంటి సినిమాగా రాబోతుంది.. అనేడౌట్స్ కామన్. ఆ డౌట్స్ ను క్లియర్ చేస్తూ లేటెస్ట్ గా మరో అప్డేట్ వచ్చిందీ ప్రాజెక్ట్ పై.  యంగ్ టైగర్ ఎన్టీఆర్, అశ్వనీదత్ కాంబినేషణ్ లో వచ్చిన రెండు సినిమాల్లో కంత్రీ మాత్రం యావరేజ్. తర్వాత వచ్చిన శక్తి నిర్మాతను ఏకంగా శక్తి హీనున్ని చేసింది. శక్తి తర్వాత అశ్వనీదత్ ఏకంగా ప్రొడక్షన్ కే దూరమయ్యాడు. మళ్లీ కూతుళ్ల సాయంతో ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ఆయనే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై చాలామంది ఆసక్తిగా చూశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకా చెబితే 2019వరకూ ఖాళీగా లేడు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. దర్శకుడెవరు..? ఇలాంటి చాలా ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఊహించే అశ్వనీదత్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది. 

కోలీవుడ్ లో చాలా తక్కువ టైమ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరి దర్శకుడు ఆట్లీ. ఆట్లీ చేసింది మూడు సినిమాలే. అయినా అతను తమిళనాట మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. స్టార్ హీరో విజయ్ కి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆట్లీకి తెలుగులో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని కోరిక. తమిళ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇదేమంత వింత కోరిక కాదు. కానీ చాలాకాలం క్రితమే అశ్వనీదత్ ఆట్లీకి అడ్వాన్స్ ఇచ్చాడు. అంటే అతని డేట్స్ అశ్వనీదత్ వద్ద ఉన్నట్టు. సో.. ఇప్పుడర్థమైంది కదా.. అతను ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎందుకున్నాడో..?

అశ్వనీదత్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా కూడా 2019లోనే ఉంటుంది. అటు ఆట్లీ డేట్స్ ఎలాగూ ఉన్నాయి కాబట్టి.. అతన్నే ఎన్టీఆర్ కు సరిపోయే కథ రెడీ చేసుకోమని చెప్పి ఉండొచ్చు. నిజానికి ఇప్పుడు ఆట్లీ కూడా కొత్తగా ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. కొన్నాళ్ల క్రితం రజినీకాంత్ కు కథ చెప్పాడు.. కానీ అతనికంటే కార్తీక్ సుబ్బరాజ్ కథ నచ్చిన రజినీ అతనికి ఓకే చెప్పాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసుకుంటున్నట్టు టాక్. ఆట్లీ సినిమాల్లో కామర్షియల్ ఎలిమెంట్స్ టో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది.. కాబట్టి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పొచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ ఒకే చెబితే ఈ ముగ్గురి కాంబినేషన్ నుంచి ఓ మంచి సినిమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. 

More Related Stories