English   

జబర్దస్త్ నటుడు నరేష్ మీద దాడి !

attack on jabardasth naresh team in srikakulam
2019-02-10 04:41:25

జబర్దస్త్ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన నరేష్ (పొట్టి నరేష్) మీద శ్రీకాకుళం లో దాడి జరిగింది. తాజాగా ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు శ్రీకాకుళం వెళ్లిన నరేష్ టీమ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వం తరపున కళింగాంధ్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం రాత్రి జబర్దస్త్ ఫేం నరేష్ తన టీమ్‌ తో ప్రదర్శన ఇచ్చాడు. అయితే మేకప్ రూంలో అందరూ రెడీ అవుతుండగా కొంతమంది యువకులు లోపలకు వెళ్లి తొంగి చూడటానికి ప్రయత్నించారు. అయితే లోపల మహిళలు బట్టలు మార్చుకుంటారు గది కాబట్టి లోపలకు రావద్దని గట్టిగా వారించారు బౌన్సర్ లు. దీంతో వివాదం చెలరేగింది. ప్రదర్శన తర్వాత నరేష్ బృందం తిరుగుప్రయాణమై వెళుతుండగా శ్రీకాకుళం చిన్నబరాటం వీధి సమీపంలో వారి వాహనాల మీద ఆ యువకులు రాళ్లు రువ్వారు. స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే యువకుల దాడితో భయ పడిన నరేశ్  బృందం పోలీసులను ఆశ్రయించడంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. మొత్తం 25 మంది యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కళింగాంధ్ర ఉత్సవాల్లో ఇలాంటి ఘటన జరగడంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. అయితే ఈ దాడిలో నరేష్ టీమ్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు చెబుతున్నారు.

More Related Stories