English   

జబర్దస్త్ వినోద్ మీద దాడికి కారణం అదేనట !

vinod
2019-07-21 21:39:31

జబర్దస్త్ నటుడు వినోద్ మీద నిన్న దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాచిగూడలోని కుత్బిగూడాలో తన మీద తన మీద తమ ఇంటి ఓనర్ ఆయన మనుషులు దాడి చేసినట్టు వినోద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తలపై, ముఖంపై బలమైన గాయాలు కావడంతో ఆయన హాస్పిటల్‌ లో కూడా అడ్మిట్ అయ్యాడు. అయితే ఆయన మీద దాడి జరగడానికి కారణం ఆర్ధిక కారణాలు అని తేలింది. ఇప్పుడు అద్దెకు ఉంటున్న ఇల్లు కొందామని ఆ ఇంటి ఓనర్ కి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడట వినోద్. అయితే పూర్తి మొత్తం చెల్లించి ఇంటి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని అడుగుతుండగా తర్వాత తర్వాత అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారని దీంతో రిజిస్ట్రేషన్ అయినా చేయించండి లేదా నా డబ్బు అయినా వెనక్కి తిరిగివ్వండి అని వారిపై వినోద్ ఒత్తిడి తెచ్చాడట. దీంతో ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని పిలిపించిన ఇంటి ఓనర్ ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వినోద్ పోలీసులకి తెలిపినట్టు సమాచారం. అయితే  తప్పించుకుని పారిపోదామని ప్రయత్నిస్తే వెంటాడి మరీ డై చేశారని కంటి మీద కూడా దాడి చేయడంతో ఆ కంటికి తీవ్రమైన గాయం కూడా అయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

More Related Stories