English   

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో...?

Vaishnav-Tej
2018-05-05 12:45:34

గ‌త కొన్నాళ్ల నుంచి యాక్ట‌ర్స్ కాంపౌండ్ లా మారిన  మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే  క‌బ‌డ్డీ టీమ్ దాటేసిన‌ ఈ క్యాంప్ నుంచి ఇప్పుడు మ‌రో యంగ్ స్ట‌ర్ లాంచ్ కాబోతున్నాడు. ఇంత‌కీ ఆ కుర్రాడెవ‌రో తెలుసా.. సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు.. వైష్ణ‌వ్ తేజ్. య‌స్.. గ‌త కొన్నాళ్లుగా న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటోన్న వైష్ణ‌వ్ లాంచింగ్ కు అన్ని ఏర్పాట్లూ పూర్త‌య్యాయి. అయితే ఈ హీరో బాధ్య‌త కూడా మెగాస్టార్ చిరంజీవి సాయి కొర్ర‌పాటిపైనే పెట్టారు. రీసెంట్ గా సాయి కొర్ర‌పాటి మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ను హీరోగా ప‌రిచ‌యం చేసే బాధ్య‌త తీసుకున్నాడు. ఇప్పుడు చిరు మ‌రో మేన‌ల్లుడు రెస్పాన్స్ బిలిటీ కూడా ఆయ‌న‌కే ద‌క్కింది. మ‌రి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా.. అవ‌స‌రాల శ్రీనివాస్.. అవును.. అవ‌స‌రాల శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ తోమ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టే చాన్స్ వ‌చ్చింది. గ‌త కొన్నాళ్లు నాని కోసం.. లేదంటే అత‌ని రేంజ్ హీరోల కోసం వెయిట్ చేస్తోన్న అవ‌స‌రాల‌కు ఇది మ‌రో చాలెజింగ్ ప్రాజెక్ట్. త‌న ఫ‌స్ట్ మూవీ ఊహ‌లు గుస‌గుస‌లాడేతో నాగ‌శౌర్య‌, రాశిఖ‌న్నాకు లైఫ్ ఇచ్చిన అవ‌స‌రాల ఈ మూవీతో వైష్ణ‌వ్ ను హీరోగా సెటిల్ చేసే బాధ్య‌త తీసుకున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రాబోతోన్న ఈమూవీ త్వ‌రలోనే ప్రారంభం కాబోతోంది. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. వైష్ణ‌వ్ తేజ్ గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన శంక‌ర్ దాదా ఎమ్బిబిఎస్ లో కోమాలోకి వెళ్లిపోయిన బాలుడు శ్రీరామ్ పాత్ర‌లో క‌నిపించాడు. అప్పుడు ఈ కుర్రాడు చిరంజీవి మేన‌ల్లుడు అని తెలిసిన వారు త‌క్కువ‌. ఇప్పుడా శ్రీరామే హీరోగా మారాడ‌న్న‌మాట‌..

More Related Stories