English   

ఒకే రోజులో 750 కోట్లు కొల్లగొట్టిన ఎవెంజర్స్ 

 Avengers
2019-04-26 10:45:23

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవెంజర్స్ ఫీవర్ నేలల్కొంది. ‘ఎవెంజర్స్’ సిరీస్‌లో భాగంగా ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ‘ది ఎండ్ గేమ్’ బుకింగ్స్ పరంగా ఎలాంటి సంచలనాలు రేపుతోందో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఓపెనింగ్ రికార్డులనూ ఈ సినిమా బద్దలు కొట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ వసూళ్ల రికార్డులు కూడా బద్దలయ్యేలాగే కనిపిస్తున్నాయి. ఐతే వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని ఆసియా దేశాల్లో రెండు రోజుల ముందే రిలీజ్ చేశారు. చైనాలో ఈ చిత్రాన్ని కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయగా తొలి రోజు వసూళ్ల మోత మోగించేసింది. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తూ ఏకంగా అక్కడ తొలి రోజు రూ.750 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సంచలనం రేపింది. దీంతో ఆసియాలో తొలి రోజున అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ కొత్త రికార్డును నమోదు చేసిందని సమాచారం.  

More Related Stories