English   

అవెంజెర్స్ ఎండ్ గేమ్...తెలుగు బహుబలిని మించిన క్రేజ్

endgame
2019-04-23 21:36:29

ఏప్రిల్‌ 26న ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ సినిమా ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని క్రేజ్ చూస్తుంటే మాత్రం పిచ్చెక్కుతోంది. మిగతా దేశాల్లో విషయం పక్కన పెడితే మన దగ్గర మాత్రం ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమాకి రానంత క్రేజ్ ను ఈ సినిమా సంపాదించింది. మాములుగా ఒక ప్రాంతీయ ఇండస్ట్రీలో ఇతర బాషల సినిమాలు ధీటుగా నిలబడడం చాలా అరుదు. రజనీకాంత్ లాంటి సూపెర్ స్టార్స్ కి మాత్రమే ఇది సాధ్యం మన సౌత్ ఇండస్ట్రీవరకూ. మన ఇండియాలో మోస్ట్ అవేయిటేడ్ సినిమా బాహుబలి. ఆ సినిమాకి టిక్కెట్లు ఆన్ లైన్లో పెట్టగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దానిని మించి ఈ సినిమా కూడా 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి బాహుబలిని కూడా దాటేసినట్టు తెలుస్తుంది. అయితే ఒక్కరోజులో బుక్‌ మై షో యాప్‌లో పది లక్షల టికెట్లు అమ్ముడుపోయాయట. అంటే క్షణానికి 18 టికెట్లు అమ్ముడుపోయినట్లు బుక్‌ మై షో సీఈఓ ఆశిష్‌ సక్సేనా ప్రకటించారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం 500 కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్నారు. ఓ హాలీవుడ్‌ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని స్క్రీన్లపై విడుదల కావడం ఇదే తొలిసారి. అది అవెంజేర్స్ క్రేజ్ అన్నమాట.

More Related Stories