English   

రాజు గారి గదిలో హీరోయిన్ మీద క్లారిటీ ఇవ్వరా ?

rgg3
2019-07-16 20:32:01

హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారిగది సిరీస్ లోని మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాయి. దీంతో ఈ సిరీస్ లో  మూడో సినిమాకు ప్లాన్ చేశాడు ఓంకార్. రాజుగారగది3 సినిమాలో లీడ్ రోల్ మొదట తమన్నా అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంది. అయితే ఏమయిందో ఏమో కానీ ఆమె సడెన్ గా తప్పుకుని షాకిచ్చింది. ఆ తర్వాత తమన్నా స్థానంలో తాప్సి అన్నారు, చందమామ అన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే తాజాగా ఆ హీరోయిన్ గా రష్మీని తీసుకుంటున్నారని ప్రచారం మొదలయ్యింది.  నిజానికి ఈ సినిమాకి అవికా గౌర్ ను తీసుకున్నారు. తమన్నా నో చెప్పగానే ఈమెను ఫైనల్ చేసింది సినిమా యూనిట్. కానీ ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందో కావడం లేదు. ఈ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన రాకపోవడమే దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అవికా ఈమధ్య గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు రాజుగారి గది-3తో మళ్లీ బిజీ కావాలని చూస్తోంది. 

More Related Stories