English   

చాప మీద మట్టి పాత్రలో...వైరల్ అవుతున్న పవన్ !

awan Kalyan Election Campaign Photos Are Viral In Social Media
2019-03-25 09:31:50

ఏపీలో ఎన్నికల డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ నేతలు స్పీడ్ పెంచుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్, కేసీఆర్ బంధాన్ని ఆయన తూర్పారబడుతున్నారు. జగన్‌కు ఓటేస్తే, టీఆర్ఎస్‌కు ఓటేసినట్టేనని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఏపీ సీమ చంద్రబాబు మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సేద తీరుతున్న విధానం జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొన్న తన కారు డిక్కీలో కూర్చొని టీ తాగుతూ సేద తీరగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆదివారం కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ చెట్టు కింద తాటి చాప వేసుకొని కూర్చుని మట్టి గిన్నెలో జొన్న అన్నాన్ని మజ్జిగలో కలుపుకొని తిన్న ఫోటోలు బయటకు వచ్చి వైరల్ గా మారాయి. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద జనసేనాని పచ్చిమిరపకాయ నంజుకుంటూ భోజనాన్ని ఆస్వాదించారు. ఇదేం సింప్లిసిటీరా నాయనా అని ఆయన అభిమానులు పొంగిపోతున్నారు.

More Related Stories