English   

అ..! నిజంగా అంతా ఆశ్చ‌ర్య‌మే..

AWE Movie and Nani
2018-02-18 14:06:47

నాని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడు. త‌మ సినిమా రెగ్యుల‌ర్ సినిమా కాదు.. ఇందులో కొత్త‌ద‌నం ఉంటుంది అని. కానీ ప్రేక్ష‌కులే అంత కొత్త ద‌నం ఏముంటుందిలే.. అన్నీ ఒకేలా ఉంటాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగానే అ.. సినిమాకు వెళ్లొచ్చిన వాళ్లకు బుర్ర హీటెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఎలా చెప్పాలో.. ఏం చెప్పాలో.. ఏమ‌ని వ‌ర్ణించాలో అర్థం కావ‌డం లేదు. సినిమాకైతే వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి. ఈ చిత్రం కొత్త ట్రెండ్ సెట్ట‌ర్ అయితే కావ‌డం ఖాయం. సినిమా ఎలా ఉంది అనే విష‌యం ప‌క్క‌నబెడితే ఇంత కొత్త‌ద‌నం మాత్రం ఊహించ‌డం తెలుగులో క‌ష్ట‌మే. ప్ర‌శాంత్ వ‌ర్మ అది చేసి చూపించాడు. దానికి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం రెండు రోజుల్లో 3 కోట్లు వ‌సూలు చేసింది. ఓ చిన్న సినిమాకు ఇంత స్థాయి క‌లెక్ష‌న్లు రావ‌డం మాత్రం చాలా విచిత్రం. ఈ జోరు ఇలాగే కొన‌సాగితే అ.. క‌చ్చితంగా విజ‌యం సాధించ‌డం ఖాయం. నాని ఏ న‌మ్మ‌కంతో అయితే ఈ చిత్రాన్ని నిర్మించాడో అది ఇప్పుడు ప్రేక్ష‌కులు కూడా పొందుతున్నారు. అర్థం కాని స్క్రీన్ ప్లే ఉండొచ్చు కానీ అర్థం లేని సినిమా అయితే కాదు ఈ అ..! మొత్తానికి నిజంగానే ఆశ్చ‌ర్యాన్ని కురిపిస్తూ ముందుకెళ్ళిపోతుంది అ.. సినిమా.

More Related Stories