English   

ప్రివ్యూ: అ..! సంగ‌తేంటో తేల‌నుంది..!

Awe-movie- preview
2018-02-16 08:48:12

నాని ఏం చేసినా కొత్త‌గా ఉంటుందని తెలుసు కానీ మ‌రీ ఇంత కొత్త‌గా ఉంటుంద‌ని మాత్రం తెలియ‌దు. నెల రోజులుగా టాలీవుడ్ లో అ.. సినిమా గురించి కావాల్సినంత చ‌ర్చ న‌డుస్తుంది. అస‌లు ఇది ఏ జోన‌ర్ సినిమానో కూడా చెప్ప‌డం క‌ష్టంగా మారింది. టైటిల్ ను ఎలా ప‌ల‌కాలో కూడా నాని చెప్పే వ‌ర‌కు అర్థం కాలేదు. త‌ను డ‌బ్బులు తీసుకుంటున్న సినిమాలే ఇంత బాగుంటే.. డ‌బ్బులు ఖ‌ర్చు పెడుతున్న సినిమా ఇంకెంత బాగా తీసుంటాడో మ‌రి..! అందుకే టైటిల్ నుంచే అంచ‌నాలు పెరిగిపోయాయి అ.. సినిమాపై. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైన‌పుడు ఇదేదో హార్ర‌ర్ సినిమా అనుకున్నారు.. ఇషా లుక్ చూసి రొమాంటిక్ అనుకున్నారు.. రెజీనా లుక్ చూసి మాఫియా అనుకున్నారు.. శ్రీ‌ని అవస‌రాల లుక్ చూసి సైంటిఫిక్ అనుకున్నారు.. కాజ‌ల్ చూసి స్కేరీ అనిపించింది.. ప్రియ‌ద‌ర్శి లుక్ చూస్తే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అనిపించింది.. ఇన్ని ఒకే సినిమాలో ఉండ‌టం చాలా అంటే చాలా కొత్త విష‌యం. ఇక ఇందులో ర‌వితేజతో పాటు తాను కూడా వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు నాని. చేప‌గా నాని.. చెట్టుగా మాస్ రాజా క‌నిపించారు. ఈ సెట‌ప్ అంతా చూస్తుంటే అవే.. అనేది చిన్న సినిమాలా అనిపించ‌ట్లేదు. ఈ మిస్ట‌రీ ఏంటో మ‌రికొన్ని గంట‌ల్లోనే వీడిపోనుంది. 

More Related Stories