English   

అ..! రివ్యూ రేటింగ్

AWE Movie Review
2018-02-16 18:59:43

అ.. తెలుగులో ఇలాంటి సినిమా రాలేద‌ని నానినే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా విడుద‌లైంది. మ‌రి నిజంగానే ఈ చిత్రం అంచ‌నాలు అందుకుందా..?  నాని న‌మ్మ‌కాన్ని ప‌్ర‌శాంత్ వ‌ర్మ నిల‌బెట్టాడా..? 

క‌థ‌: న‌ల్ల(ప్రియ‌ద‌ర్శి) ఓ చెఫ్. ఏం రాక‌పోయినా కూడా అన్ని వంట‌లు వ‌చ్చ‌ని చెప్పి జాబ్ కొట్టేస్తాడు. అత‌డికి చేప‌(నాని), చెట్టు(ర‌వితేజ‌) హెల్ప్ చేస్తుంటాయి. అదే స‌మ‌యంలో రాధ‌(ఇషారెబ్బా) కృష్ణ‌(నిత్యామీన‌న్) ను ప్రేమిస్తున్నాని చెబుతుంది. మ‌రోవైపు మీరా(రెజీనా) బాయ్ ఫ్రెండ్ తో దొంగ‌త‌నానికి ట్రై చేస్తుంటుంది. యోగి(ముర‌ళీశ‌ర్మ‌) ఏమో ఓ మెజిషియ‌న్. చిన్న‌పిల్ల‌తో పంథానికి పోతుంటాడు. శ్రీ‌ని అవ‌స‌రాల సైంటిస్ట్. అదే స‌మ‌యంలో కాళి(కాజల్) సూసైడ్ చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. అస‌లు వీళ్లంద‌రికీ ఎలా క‌నెక్ష‌న్ ఉంది అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: అ.. సినిమా చూసిన త‌ర్వాత ఇది ఎలా ఉంది.. ఇలా ఉందా అని చెప్ప‌డానికి ఏం లేదు. నార్మ‌ల్ గా పేరెంట్స్ తో ఓ అమ్మాయి త‌న బాధ‌ను చెప్పుకుని.. పెళ్లి గురించి మాట్లాడే సీన్ తోనే మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఒక్కో పాత్ర క‌థ‌లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. అక్క‌డ ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే. ఒక‌రేమో సూసైడ్ చేసుకోడానికి గ‌న్ తీసుకుంటారు.. అదే స‌మ‌యంలో లెస్బియ‌న్స్ ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటామ‌ని త‌ల్లిదండ్రుల‌ను క‌న్విన్స్ చేస్తుంటారు. అంత‌లోనే ఒక‌రు వ‌చ్చి డ‌బ్బు దొంగిలించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇదే క‌థ‌లో సంబంధం లేకుండా టైమ్ మిష‌న్ క‌నిపెట్టాల‌ని మ‌రొక‌రు ప్రాణం పోయేలా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇలా ఒక సీన్ తో మ‌రో సీన్ కు సంబంధమే ఉండ‌దు. అలాగ‌ని ఇది త‌ల‌తోక లేని పిచ్చి సినిమా అని కూడా చెప్ప‌లేం. ఇలాంటి స్క్రీన్ ప్లే రాయ‌డం చాలా క‌ష్టం. కానీ ప్ర‌శాంత్ వ‌ర్మ చేసాడు. కానీ ఎలా చేసాడు అనేది మాత్రం తెర‌పై చూడాల్సిందే. ఇంట‌ర్వెల్.. క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం సినిమాకు హైలైట్. 

న‌టీన‌టులు: ఇందులో అంద‌రి పాత్ర‌లు త‌క్కువ నిడివితోనే ఉంటాయి. కాజ‌ల్ చాలా బాగా చేసింది. ఆమె పాత్రే సినిమాకు కీల‌కం. కానీ అంద‌రికంటే త‌క్కువగా క‌నిపించేది ఆమె. ఇక నిత్యామీన‌న్ డేరింగ్ ఉన్న పాత్ర‌లో న‌టించింది. ఇలాంటి పాత్ర చేయ‌డానికి కూడా ధైర్యం కావాలి. ఇషారెబ్బా ల‌వ‌బుల్ గా ఉంది. ప్రియ‌దర్శి చేప‌, చెట్టుతో కామెడీ బాగానే చేసాడు. ముర‌ళీ శ‌ర్మ మెజీషియ‌న్ గా బాగా న‌టించాడు. ఇక రెజీనా డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డిన అమ్మాయిగా సూప‌ర్ గా చేసింది. శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ఉన్న‌ది కాసేపే అయినా అద్భుతంగా న‌టించాడు. ఇలా ఎవ‌రికి వాళ్లు సినిమాలో త‌మవంతు పాత్ర‌లు బాగానే చేసారు.

టెక్నిక‌ల్ టీం: ఈ సినిమాకు సంగీతం కీల‌కం. కొత్త సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ ఏ రాబిన్ త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో అల‌రించాడు. ఇక కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఉన్నంత‌లో చాలా బాగా చూపించాడు సినిమాను. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. ఇక ద‌ర్శ‌కుడి గురించి చెప్పుకోవాలి. ఇంత కాంప్లికేటెడ్ క‌థ‌ను ప్ర‌శాంత్ చేయాల‌నుకోవ‌డ‌మే సాహ‌సం. కానీ దాన్ని తెర‌కెక్కించ‌డంలో ఇంకాస్త ఆక‌ట్టుకుని ఉంటే బాగుండేది. చాలా చోట్ల క‌థ అర్థ‌మే కాదు. ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. సుకుమార్ అనుకుంటే ఆయ‌న‌కు తాత‌లా మారిపోయాడు ప్రశాంత్.

చివ‌ర‌గా: అ.. చాలా కొత్త‌గా ఉంది.. కానీ అంతే పిచ్చిగా కూడా ఉంది..

రేటింగ్: 2.0/5

More Related Stories