English   

అయ్యా జ‌క్క‌న్న మ‌ళ్లీ అదేనా..?

Ayya-Jakkanna-Malli-Adeyna
2017-05-03 06:40:55

రాజ‌మౌళికి రెస్ట్ అనేది ఉండ‌దా.. ఐదేళ్లు ఓ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడు.. ఇప్పుడు ఆ సినిమా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఇక హాయిగా సినిమా గోల వ‌దిలేసి కొన్నాళ్లు కుటుంబంతో క‌లిసి చేయొచ్చు క‌దా..! కానీ రాజ‌మౌళి మాత్రం సినిమాను ప్రాణంగా ప్రేమిస్తాడు. అందుకే ఇప్పుడు కూడా బాహుబ‌లిని ఇంకా వ‌ద‌ల‌డం లేదు. ఈయ‌న ప్ర‌స్తుతం నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌, హీరోయిన్ అనుష్క‌, పెద్ద‌న్న కీర‌వాణితో క‌లిసి లండ‌న్ లో ఉన్నారు. అక్క‌డి బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బాహుబలి ది కంక్లూజన్ ను స్పెషల్ స్క్రీనింగ్ చేస్తుండగా..

అక్కడ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేసుకునేందుకే రాజమౌళి అండ్ టీం లండన్ లో తేలారు. అక్క‌డే త‌మ సినిమాకు సంబంధించిన విశేషాలన్నీ చెబుతున్నాడు రాజ‌మౌళి. ప్ర‌త్యేకంగా అక్క‌డి మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తున్నారు రాజ‌మౌళి టీం. ఇదంతా చూస్తుంటే బాహుబ‌లి 2ను ఇప్ప‌ట్లో ఆపేలా క‌నిపించ‌డం లేదు ద‌ర్శ‌క‌ధీరుడు. మొత్తానికి ఒక్క సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ ఫేమ‌స్ అయిపోయాడు జ‌క్క‌న్న‌.

More Related Stories