English   

 సినిమా బాలేదు.. కానీ కలెక్షన్స్ ఫుల్

Baaghi-2-collections
2018-03-31 18:45:21

బాలేని సినిమాకు కలెక్షన్లు రావడం అరుదుగా జరుగుతుంది. అది కూడా అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. బాలీవుడ్ లో ఈ శుక్రవారం విడుదలైన భాగీ-2 సినిమా గురించే ఇదంతా. 2016లో తెలుగులో సూపర్ హిట్ అయిన క్షణం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భాగీ-2పై విమర్శకులు పెదవి విరిచారు. అసలు కంటెంట్ ను పక్కన బెట్టి కండలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. సినిమా ఏ దశలోనూ ఎంగేజ్ చేయలేకపోయిందనే విమర్శలు సాధారణ ప్రేక్షకుల నుంచీ వినిపిస్తోంది. నిజానికి క్షణం సినిమాలో యాక్షన్ కంటే థ్రిల్లర్ కంటెంట్ ఎక్కువ. కానీ ఇక్కడ థ్రిల్లర్ కంటే యాక్షన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంతో ఆయా సీన్స్ లో ఉండాల్సిన ఇంటెన్సిటీ అంతా తగ్గిపోయి.. ఏదో భారీ యాక్షన్ సినిమా చూస్తోన్న ఫీలింగ్ ఇస్తుందీ సినిమా.. ఒరిజినల్ సినిమా చూసిన ఎవరికైనా ఈ భాగీ -2 పదిశాతం కూడా నచ్చదు అనేది నిజం. భాగీ-2 బాలేదు.. ఇది విమర్శకుల నుంచి, సాధారణ ప్రేక్షకుల వరకూ చెబుతోన్న మాట. కానీ మాటలు దాటుకుని ఏకంగా ఫస్ట్ డేనే 25కోట్లు వసూలు చేసి ఎంటైర్ బాలీవుడ్ కు షాక్ ఇచ్చిందీ మూవీ.. టైగర్ ష్రాఫ్, అతని లవర్ గా రూమర్స్ లో ఉన్న దిశాపటానీ నటించిన ఈ సినిమాలో ప్రతీక్ బబ్బర్, మనోజ్ బాజ్ పేయి, రణదీప్ హుడా కీలక పాత్రల్లో నటించారు. ఏదేమైనా రివ్యూస్ కు రిజల్ట్ సంబంధం లేదని భాగీ-2 మరోసారి ప్రూవ్ చేసింది.

More Related Stories