English   

షారుక్ రికార్డ్ క‌దిలించలేక‌పోయిన బాహుబ‌లి 2..

Baahubali 2 SharukhKhan collections
2017-05-02 06:24:14

బాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు ఇండియాలోని అన్ని రికార్డులు బాహుబ‌లి 2 పేరుపైనే ఉన్నాయి. ఆ సినిమా దూకుడు అలా న‌డుస్తోందిప్పుడు. కానీ ఎన్ని రికార్డులు సాధించినా ఒక్క రికార్డు మాత్రం ఇప్ప‌టికీ షారుక్ చేతుల్లోనే ఉండిపోయింది. అదే హైయ్య‌స్ట్ ఓపెనింగ్ డే రికార్డ్. మూడేళ్ల కింద‌ వ‌చ్చిన హ్యాపీ న్యూ ఇయ‌ర్ తొలిరోజు హిందీలో 42 కోట్లు.. మిగిలిన భాష‌ల్లో మ‌రో 2 కోట్లు.. మొత్తంగా 44 కోట్లు వ‌సూలు చేసింది. ఈ రికార్డ్ ఇప్ప‌టికీ ప‌దిలంగా ఉంది. బాహుబ‌లి 2 తొలిరోజు హిందీ వ‌ర్ష‌న్ 41 కోట్లు వ‌సూలు చేసి ద‌గ్గ‌ర్లోనే ఆగిపోయింది. కాక‌పోయే హైయ్య‌స్ట్ సింగిల్ డే వ‌సూళ్లు మాత్రం బాహుబ‌లి 2 పేరుమీదే ఉన్నాయి. విడుద‌లైన మూడో రోజు 46 కోట్లు వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించాడు బాహుబ‌లి 2. కాక‌పోతే తొలిరోజు మాత్రం షారుక్ కే వ‌దిలేసాడు. మ‌రి ఈ రికార్డ్ బీట్ చేసే ఆ వీరుడు ఎవ‌రో..?

More Related Stories