English   

బాహుబలి-2..  చైనా రిలీజ్ డేట్ వచ్చేసింది

Baahubali 2-China

బాహుబలి -2 ఇండియన్ సినిమా కెపాసిటీని ప్రపంచానికి చూపిన సినిమా. ప్రభాస్, రాజమౌళి, రానా, అనుష్కల ప్రతిభకు ప్రపంచమంతా ఫిదా అయిన సినిమా. అయితే ఇండియాలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన బాహుబలి -2 ప్రస్తుతం జపాన్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆ సక్సెస్ ను అక్కడి ఆడియన్స్ తో పంచుకోవడానికి జక్కన్న జపాన్ కూడా వెళ్లాడు. అయితే మొదటి భాగంతో భంగపడ్డ బాహుబలి ఇప్పుడు రెండో పార్ట్ తో తన సత్తా చూపించడానికి చైనా వెళ్లబోతోంది. లేటెస్ట్ గా చైనాలో రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. మే 4న బాహుబలి-2 చైనాలో విడుదల కాబోతోంది.  బాహుబలికి చైనా పెద్దగా ఆదరణ రాలేదు. బానే ఉందన్నారు కానీ.. అనుకున్నంతగా కలెక్షన్లు రాలేదు. దీంతో ఇప్పుడీ సెకండ్ పార్ట్ కు అక్కడ కీలకంగా మారింది. అందుకే ప్రపంచమంతా బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి-2 చైనాలో ఎలా ఆడుతుందా అనే ఆసక్తి అందర్లోనూ ఉంది. ఈ వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఎడిటింగ్ కూడా చేయించారు. ఇందుకోసం వాల్డ్ ఫేమస్ ఎడిటర్ విన్సెంట్ టైబెల్లాస్ తో ఎడిటింగ్ చేయించారు. ఇతను ది ఇన్ క్రెడిబుల్ హల్క్, క్లాష్ ఆఫ్ ది టైటన్స్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. మొత్తంగా ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకుని చైనా ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది టీమ్. మరోవైపు ఇండియాలో బాహుబలిని  కొట్టలేకపోయిన ఆమిర్ ఖాన్ దంగల్ చైనాలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దంగల్ అక్కడ ఏకంగా 1200ల కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డ్ టార్గెట్ గా ఇప్పుడు బాహుబలి -2 చైనాలో అడుగుపెట్టబోతున్నాడు. ఆ టార్గెట్ ను చేదిస్తాడా లేదా అనేది మే 4నే తేలిపోతుంది. 
 

More Related Stories