English   

సరిగ్గా ఏడేళ్ల కింద బాహుబలి అనే అద్భుతం ఇదే రోజు..

 Baahubali
2020-07-07 11:29:21

బాహుబలి.. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమాలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం 2400 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు భాగాలు కలిపి ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని లెక్కలు సెట్ చేసింది బాహుబలి. రాజమౌళి కలలకు ప్రతిరూపం ఈ చిత్రం. ఐదేళ్ల పాటు కష్టపడి ఈ సినిమా తెరకెక్కించాడు దర్శక ధీరుడు. ఇదిలా ఉంటే జులై 6 బాహుబలి సినిమాకు ప్రత్యేకం. ఎందుకంటే సరిగ్గా ఏడేళ్ల కింద ఇదే రోజు ఈ చిత్రం మొదలైంది. 

అప్పట్లో 2013, జులై 6న కర్నూలు పరిసర ప్రాంతాల్లో బాహుబలి సినిమాను మొదలు పెట్టాడు రాజమౌళి. అప్పట్లో ప్రభాస్, రాజమౌళి కలిసి ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. చుట్టూ వేలాది మంది అభిమానులు చూస్తుండగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు జక్కన్న. ఆ తర్వాత మూడేళ్లకు తొలి భాగం.. రెండో భాగం ఐదేళ్ల తర్వాత విడుదల చేసాడు ఈయన. 2015 జులై 10న బాహుబలి తొలి భాగం.. ఎప్రిల్ 28, 2017న రెండో భాగం విడుదల చేసాడు రాజమౌళి. బాహుబలి తొలి పార్ట్ 500 కోట్లు.. రెండో భాగం 1800 కోట్లు వసూలు చేసింది. ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టి ఏడేళ్లు పూర్తి కావడంతో దీనికి సంబంధించిన మెమోరీని సోషల్ మీడియాలో పంచుకున్నాడు రాజమౌళి. 

More Related Stories