English   

పాకిస్థాన్ పై బాహుబ‌లి దండ‌యాత్ర‌..

baahubali releasing in Pakistan
2017-05-02 05:55:44

మ‌న సినిమాల‌కు పాకిస్థాన్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా హిందీ సినిమాల‌న్నీ పాక్ లోనూ విడుద‌ల‌వుతుంటాయి. అక్క‌డ కూడా హిందీ మాట్లాడే వాళ్లు ఉంటారు కాబ‌ట్టి మ‌న సినిమాల‌కు అక్క‌డ గిరాకీ బాగా ఎక్కువ‌. ఇప్ప‌టికే అక్క‌డ ఖాన్స్ సినిమాల‌కు దాదాపు 40 నుంచి 60 కోట్ల మార్కెట్ ఉంది. ఇప్పుడు బాహుబ‌లి 2 కూడా పాక్ లో విడుద‌ల కానుంది. ఆ సినిమాను మేం కూడా చూస్తాం.. ఇక్క‌డ కూడా విడుద‌ల చేయండంటూ క‌ర‌ణ్ జోహార్ కు సందేశాలు అందుతున్నాయ‌ని తెలుస్తోంది.

పాక్ ప్ర‌జ‌ల ఆశ‌ను గ‌మ‌నించిన క‌ర‌ణ్.. బాహుబ‌లి 2 పాక్ వ‌ర్షన్ ను సిద్ధం చేస్తున్నాడు. బాహుబ‌లి పార్ట్ వ‌న్ కూడా అక్క‌డ విడుద‌ల కాలేదు. అంటే రెండు భాగాలు ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నార‌న్న‌మాట‌. పైగా పాక్ లో బాహుబ‌లి 2కు అడ్డు చెప్ప‌డానికి పెద్ద‌గా కాంట్ర‌వ‌ర్సీలు కూడా ఏం లేవు. ఇదో చ‌క్క‌టి చంద‌మామ క‌థ‌. ఈ క‌థ‌ను పాక్ కూడా ఆస్వాదిస్తుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఒకేసారి రెండు భాగాలు విడుద‌ల చేస్తే క‌చ్చితంగా పాక్ నుంచి మ‌రో 100 కోట్ల వ‌ర‌కు నిర్మాత‌ల బ్యాంకుల్లో జ‌మైపోయిన‌ట్లే.. మొత్తానికి బాహుబ‌లి దండ‌యాత్ర ఇప్పుడు పాకిస్థాన్ వైపు వెళ్తోంద‌న్న‌మాట‌. మ‌రి శ‌తృదేశంలో మన సినిమా ఎలా రెచ్చిపోనుందో..?

More Related Stories