English   

ఆ బాలీవుడ్ నటికి ఫిదా అయిపోయిన రాజమౌళి తండ్రి..

kang
2019-12-10 20:33:19

విజయేంద్ర ప్రసాద్.. ఈయన పేరు తెలుగు ఇండస్ట్రీలో తెలుసు కానీ ప్రేక్షకులకు మాత్రం పెద్దగా పరిచయం ఉండదు. కానీ రాజమౌళి తండ్రి అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. బాహుబలి సినిమాతో ఈయన కూడా స్టార్ అయిపోయాడు. అప్పటికే కొన్ని వందల సినిమాలు రాసినా కూడా రాని పేరు బాహుబలి సినిమాతో వచ్చింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా ఈయన పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా ఓ హీరోయిన్ అయితే విజయేంద్రున్ని అస్సలు వదడం లేదు. ఆవిడే కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్. ఈమె ఏ సినిమా చేయాలన్నా.. విజయేంద్రప్రసాద్ సలహాలు తీసుకోకుండా చేయడం లేదు. రాజమౌళి తండ్రితో ఆమెకు పరిచయం బాగా పెరిగిపోయింది. అతన్ని కంగన ఓ పెద్దదిక్కులా భావిస్తుంది. ఏం చేయాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకుంటుంది కంగన

. ఇక విజయేంద్రప్రసాద్ కూడా కంగన కోసమే హిందీలో కథలు రాస్తున్నాడు. మణికర్ణికతో ఈ ఇద్దరి జర్నీ మొదలైంది. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణికకు విజయేంద్రప్రసాద్ కథ అందించారు. సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ.. తన బయోపిక్ కు విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారని ప్రకటించింది కంగనా రనౌత్. ఇక ప్రస్తుతం కంగన నటిస్తున్న జయలలిత బయోపిక్ తలైవి కథ కూడా ఆయనే రాస్తున్నాడు. ఇప్పుడు కంగన నటించే ప్రతీ కథ వెనక కూడా విజయేంద్రప్రసాద్ హస్తం కనిపిస్తుంది. ఇప్పుడు కంగన నిర్మాతగా మారి మొన్న తీర్పు వచ్చిన రామ్ మందిర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న అయోధ్య సినిమాకు కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నాడు. మొత్తానికి మణికర్ణిక తర్వాత పూర్తిగా విజయేంద్రప్రసాద్ పై ఆధారపడింది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories