English   

మోహన్ లాల్ డౌన్ డౌన్

mohan lal
2018-07-24 15:41:34

మోహన్ లాల్ డౌన్ డౌన్ ... ఇలా అంటోంది ఎవరో తెలుసా.. మళయాల సినిమా ఆర్టిస్టులు.. యస్.. అక్కడ మళయాల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా కూడా ఉన్న మోహన్ లాల్ పై వందమందికి పైగా ఆర్టిస్టులు ఇలా వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు.. ఓ మహిళ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన మోహన్ లాల్ వంటి వ్యక్తికి అస్సలు సపోర్ట్ చేయం అంటూ ఖరాకండీగా చెబుతున్నారు. అతను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా.. అంత పెద్ద వ్యక్తిత్వం లేనప్పుడు ఏమాత్రం గౌరవించదగిన వ్యక్తి కాదని ఖచ్చితంగా చెబుతున్నారు వాళ్లు. మరి ఇలా అనడానికి కారణం ఏంటీ..? ఎందుకు ఇంతమంది ఆర్టిస్టులు మోహన్ లాల్ కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు..

కేరళ ప్రభుత్వం సినిమా అవార్డులు ప్రకటించబోతోంది. ఈ వేడుకలకు మోహన్ లాల్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తున్నారు అయితే ఈ వేడుకకు మోహన్ లాల్ ను ఆహ్వానిస్తే తామెవరమూ రాము అని మళయాల మూవీ అసోసియేషన్(అమ్మా) లోని కీలకమైన సభ్యులు ప్రభుత్వానికి తెగేసి చెబుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన దర్శకుడు బిజుకుమార్ ఈ విషయంపై ఫేస్ బుక్ లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. అతను చెప్పిన దాన్ని బట్టి.. ఎంతోమంది ఆర్టిస్టులు వ్యతిరేకిస్తోన్న వ్యక్తిని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఆ ఫంక్షన్ ఆహ్లాదకరంగా ఉండదని చెబుతున్నాడు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది. మోహన్ లాల్ చీఫ్ గెస్ట్ గా రావడాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ప్రకాష్‌రాజ్‌, ఎన్‌ఎస్‌ మాధవన్‌, సచిదానందన్‌, కేజీ శంకరన్‌ పిళ్లై, రాజీవ్‌ రవి, బినా పాల్‌, రిమా కల్లింగల్‌, శృతి హరహరన్‌ వంటి టాప్ ఆర్టిస్టులున్నారు. మరి ఈ రచ్చకు కారణమేంటో తెలుసా.. దిలీప్ ను మోహన్ లాల్ సపోర్ట్ చేయడమే.

కొన్నాళ్ల క్రితం నటి భావనపై లైంగిక వేధింపులకు పాల్పడేలా ప్రేరేపించిన కేస్ లో దిలీప్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఆ సంఘటనను దిలీపే చేయించాడనడానికి పోలీస్ ల వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేస్ లో కోర్ట్ లోఉంది. ఈ టైమ్ లో దిలీప్ ను ‘అమ్మా’ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత దిలీప్ జైలు నుంచి విడుదలయ్యాడు. రెండు సినిమాలు కూడా చేశాడు. దీంతో తన పాత స్నేహితుడనే కారణంతో పాటు తనే అమ్మా అధ్యక్షుడి అన్న హోదాలో మోహన్ లాల్ దిలీప్ తిరిగి అమ్మాలోకి తీసుకున్నాడు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు కూడా చాలామంది మళయాల నటులు మోహన్ లాల్ ను వ్యతిరేకించారు. దీంతో దిలీప్ తనే స్వయంగా తనకా సభ్యత్వం వద్దు అన్నాడు. కానీ మోహన్ లాల్ వంటి స్టార్ .. ఓ మహిళకు అన్యాయం చేసిన వ్యక్తిని సపోర్ట్ చేయడ మాలీవుడ్ లో ఎవరికీ నచ్చలేదు. దీంతో అప్పటి నుంచీ ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం సిద్ధమైంది. ఇప్పుడు ఆ వర్గమే మోహన్ లాల్ కేరళ ప్రభుత్వ అవార్డ్ లకు చీఫ్ గెస్ట్ గా పిలవొద్దని చెబుతోంది. ఆయనొస్తే మేం రామని కూడా ఖచ్చితంగా చెబుతున్నారు. మరి ఈ గొడవపై కేరళ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories