English   

అటు బాహుబ‌లి.. ఇటు ఆఫీస‌ర్

bahubali and officer

దేనికైనా ఓ బెంచ్ మార్క్ ఉండాలి. లేదంటే మ‌నం ఏం సాధించాము అన్న‌దానికి అర్థం ఉండ‌దు. అలా చూస్తే బాహుబ‌లి లాగానే ఆఫీస‌ర్ కూడా ఓ కొత్త బెంచ్ మార్క్ సాధించాడు.  మ‌రి అదేంటో తెలిస్తే ఖ‌చ్చితంగా ఇది నిజ‌మే క‌దా అనిపించక మాన‌దు. ఆ విష‌యంలో ఆఫీస‌ర్ ఘ‌న‌త పెద్ద‌దే. ఇంత పెద్ద ఘ‌న‌త సాధించిన ఆఫీస‌ర్ ను బాహుబ‌లితో కంపేర్ చేస్తే కొంత‌మందికి కోపం రావొచ్చేమో కానీ.. అస‌లు విష‌యం తెలిస్తే కానీ బోధ‌ప‌డ‌దు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. బాహుబ‌లి టాలీవుడ్ కే కాకుండా నేష‌న‌ల్ వైడ్ గా మ‌న సినిమాకో బెంచ్ మార్క్ సెట్ చేసింది. మేకింగ్ మేట‌ర్ ప‌క్క‌న బెడితే క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాహుబ‌లిది ది బెస్ట్ బెంచ్ మార్క్. అలాగే ఇప్పుడు ఆఫీస‌ర్ కూడా  క‌లెక్ష‌న్స్ లో బాహుబ‌లిలాగా ఓ బెంచ్ మార్క్ సెట్ చేశ‌డు. అయితే  హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ తో బాహుబ‌లి రికార్డ్ క్రియేట్ చేస్తే .. లోయొస్ట్ క‌లెక్ష‌న్స్ తో ఆఫీస‌ర్ రికార్డులు సెట్ చేశాడు. 

ఓ పేద్ద ద‌ర్శ‌కుడు, మ‌రో పేద్ద హీరో.. క‌లిసి చేసిన సినిమా ఆఫీస‌ర్.. ఆ ఇద్ద‌రికీ తిరుగులేని అవమానం మిగిల్చింది. నాగార్జున లాంటి స్టార్ హీరో.. అది కూడా రీసెంట్ గా యాభైకోట్ల క్ల‌బ్ లో చేరిన హీరో సినిమా ఫ‌స్ట్ వీకెండ్ లో క‌నీసం కోటి కూడ సాధించ‌లేదు. ఇంత‌కు మించిన అవ‌మానం నాగార్జున కెరీర్ లో ఏముంటుంది. ఒక సినిమా ఎంత చెత్త‌గా ఉంద‌నేది క‌లెక్ష‌న్స్ చెబుతాయి. అలా చూస్తే ఆఫీస‌ర్.. అలాంటి చెత్త సినిమాల‌కు  బెంచ్ మార్క్ సెట్ చేశాడ‌నే చెప్పాలి. ఈ ఘ‌న‌త సాధించిన ద‌ర్శ‌కుడుగా రామ్ గోపాల్ వ‌ర్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందేమో. 

ఆఫీస‌ర్ ఫ‌స్ట్ వీకెండ్ ముగిసేనాటికి క‌నీసం కోటి కూడా రెవిన్యూ తీసుకురాలేకపోయింది. దీంతో ఆ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూట‌ర్స్ ఇప్పుడ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని మ‌రీ బెదిరిస్తున్నారు. ఏదేమైనా కెరీర్ చివ‌ర్లో నాగార్జున చేసిన ఈ మిస్టేక్ బాహుబ‌లిలాగా ఓ బెంచ్ మార్క్ సెట్ చేయ‌డం విశేషం.

More Related Stories