English   

వేలానికి ద‌ర్శ‌క దిగ్గ‌జం ఆస్తులు..

Balachander
2018-02-15 13:59:25

పోయినోళ్లంతా గొప్పోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గుర్తులు అంటారు. ఇప్పుడు ఆ తీపిగుర్తులు కూడా ఉంచ‌ట్లేదు. అవి కూడా వేలం వేస్తున్నారు. ఇప్పుడు ద‌ర్శ‌క దిగ్గ‌జం బాల‌చంద‌ర్ ఆస్తులు వేలం వేస్తున్నారంటూ త‌మిళ‌నాట వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది నిజ‌మే అని తెలుస్తుంది. బాల‌చంద‌ర్ చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న ఆస్తుల‌న్నీ బ్యాంక్ ఆధీనంలోనే ఉన్నాయి. ఈయ‌న చ‌నిపోయి కూడా రెండేళ్లు అవుతుంది. అప్ప‌ట్నుంచీ ఆస్తులు వేలం వేయాల‌ని చూస్తున్నారు బ్యాంక్ అధికారులు. అప్ప‌ట్లో త‌న కవితాలయా సంస్థ నిర్మించిన టీవీ సీరియల్‌ కోసం బాల‌చంద‌ర్ ఇంటితో పాటు త‌న కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకెట్టు పెట్టారని తెలుస్తుంది. కానీ అది తీర్చ‌కుండానే ఆయ‌న వెళ్లిపోయారు. దాంతో ఇప్పుడు ఆ అప్పు కింద బ్యాంక్ అధికారులు వేలానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. 2015లో సీరియల్‌ నిర్మాణ పనులను రద్దుచేసి డిజిటల్‌ నిర్మాణ పనులు చేపట్టామని.. అప్పటి వరకు బ్యాంకులో తీసుకున్న రుణంపై అసలుతో పాటు వడ్డీ కూడా కొంతమేరకు తిరిగి చెల్లించామని బాల‌చంద‌ర్ కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో ఒకేసారి చెల్లించేలా చట్ట ప్రకారం ప్లాన్ చేసుకుంటున్నామ‌ని చెప్పారు. ఈ సమయంలోనే బ్యాంకు వేలం ప్రకటన వేసిందన్నారు. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ బాల‌చంద‌ర్ ఇళ్లు మాత్రం బ్యాంకుకు పోనిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని చెబుతున్నారు ఆయ‌న కుటుంబ స‌భ్యులు. ఇంత జ‌రుగుతున్నా కూడా దీనిపై బాలచంద‌ర్ ప్రియ‌శిష్యులు ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ ఏం మాట్లాడ‌క‌పోవ‌డం త‌మిళ‌నాట అంద‌ర్ని ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తుంది. 

More Related Stories