English   

థాయ్ ల్యాండ్ లో సందడి మొదలెట్టిన బాలయ్య 

Balakrishna
2019-08-11 13:09:17

ఎట్టకేలకి బాలయ్య సినిమా మొదలయ్యింది. ఈ ఏడాది మొదటిలో కధానాయకుడు, మహానాయకుడు సినిమాలు చేసిన ఆయనకి ఆ రెండు సినిమాలు పెద్దగా హిట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తన తర్వాతి సినిమా మీద ద్రుష్టి పెట్టాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తోన్న 105వ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్నాటు నుండి థాయ్‌లాండ్‌లో ప్రారంభమైందని సమాచారం. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌ మీద సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారని చెబుతున్నారు. భూమిక చావ్ల, ప్రకాశ్ రాజ్, జయసుధ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని థాయ్‌లాండ్‌ లో జరగనున్న భారీ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. బాలయ్య గత సినిమాలకి సంగీతం అందిస్తోన్న చిరంతన్ భట్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్న ఈ సినిమా మీద బాలయ్య చాల హాప్ పెట్టుకున్నారు.

More Related Stories