English   

బాలయ్య...పార్టీ గురించి పట్టింపేదయ్య?

Balakrishna
2019-11-15 15:22:04

ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తిరిగేటట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తర్వాత...పెద్ద సంఖ్యలో నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయడం...మరోవైపు ఎమ్మెల్యేలు సైతం పచ్చపార్టీని వీడుతుండటం...చర్చనీయాంశంగా మారుతోంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే పేరు పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంటరిగా ముందుకు సాగుతుండగా... ఆయనకు తనయుడు లోకేష్ బావమరిది బాలకృష్ణ అండగా నిలవలేని స్థితిలో ఉండటంతో...సైకిల్ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండనుందనే సందేహం వ్యక్తమవుతోంది.

ఈ ఇద్దరు నేతలూ చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టిన వారే! స్పష్టంగా చెప్పాలంటే...పార్టీ నేతల అసంతృప్తిని దూరం చేయడంలో చంద్రబాబు విఫలం అవుతున్నారు. ఇలాంటి సమయంలో...బాబు తనయుడు లోకేష్పై అందరి చూపు ఉన్నప్పటికీ...ఆయన రాజకీయ పరిణతి అంతంతే. దీంతో టీడీపీ శ్రేణులు సహజంగానే...కలవరపాటుకు గురవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బాలకృష్ణ నేనున్నా అంటూ పార్టీని ముందుకు నడిపిస్తారని టీడీపీ నేతలు ఆశిస్తే...దానికి భిన్నంగా బాలయ్య...సినిమా బిజీలో ఉండిపోవడంతో...అధికార పార్టీకి ధీటుగా టీడీపీ నిలబడగలుగుతుందా? అనే సందేహం తెలుగుదేశం శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి