English   

బాల‌య్య‌-పూరీ సంచ‌ల‌నం..

Balakrishna-And-Puri-Jagannadh-s-Latest-Sensation
2017-05-09 03:02:26

పూరీ సినిమా అంటే బ‌డ్జెట్ 20 కోట్ల‌కు మించ‌దు. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా త‌న బ‌డ్జెట్ మాత్రం చాలా త‌క్కువ‌లో పూర్తి చేస్తాడు. అనుకున్న టైమ్ లో సినిమాను పూర్తి చేయాలంటే పూరీ త‌ర్వాతే ఎవ‌రైనా. ఇప్పుడు బాల‌య్య సినిమాను కూడా ఇదే స్పీడ్ లో.. ప‌క్కా ప్లానింగ్ తో పూర్తి చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈ సినిమా హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌యింది. తాజాగా పోర్చుగ‌ల్ వెళ్ల‌నున్నారు బాల‌య్య అండ్ టీం. అక్క‌డే 40 రోజుల భారీ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. సెప్టెంబ‌ర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో మాఫియా డాన్ గా న‌టిస్తున్నాడు బాల‌కృష్ణ‌. షూటింగ్ స‌గం కూడా పూర్తి కాలేదు.. పైగా పూరీ కూడా పెద్ద‌గా ఫామ్ లో లేడు. అయినా స‌రే బాల‌య్య సినిమాపై అంచ‌నాలు మాత్రం భారీగా ఉన్నాయి.

దానికి నిద‌ర్శ‌న‌మే తాజాగా ప‌లికిన శాటిలైట్ రైట్స్. జెమినీ టీవీ ఈ సినిమాను 9 కోట్ల‌కు కొనేసింది. పూరీ ఈ సినిమాకు పెట్టిస్తోన్న బ‌డ్జెట్ తో పోలిస్తే.. ఈ శాటిలైట్ రైట్స్ బాగా ఎక్కువే. ఇంకా చెప్పాలంటే బ‌డ్జెట్ లో దాదాపు స‌గం ఈ రైట్స్ రూపంలోనే నిర్మాత‌ల‌కు వ‌చ్చేసాయి. ఇక చూడాలి.. రేపు విడుద‌లైన త‌ర్వాత సినిమా ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories