English   

కొత్త గెటప్ లో దర్శనమిస్తున్న బాలయ్య...ఫోటోలు వైరల్

 Balakrishna
2021-02-23 17:48:51

ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ "ఎన్ టీ ఆర్ కధానాయకుడు" చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.."భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను.  

అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను." అంటూ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా  బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో "ఎన్టీఆర్ కథానాయకుడు" సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 2019లో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో బాలయ్య అనేక పాత్రల్లో నటించి మెప్పించాడు. సినిమాలో విద్యాబాలన్, కళ్యాణ్ రామ్,ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

More Related Stories