English   

బాలయ్య బోయపాటి సినిమాకి అదిరిపోయే టైటిల్

Balakrishna Boyapati
2021-02-19 15:06:12

నట నటసింహం నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన కుర్ర హీరొయిన్ సాయేషా నటిస్తోంది. సాయేషా అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా కు టైటిల్ ఖరారు చేయలేదు. దాంతో సినిమా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ను ఖరారు చేసింది. ఇప్పటికే బోయపాటి బాలకృష్ణ తో సింహా, లెజెండ్ వంటి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. దాంతో ఈ సినిమా కూడా రికార్డులు బద్దలు కొడుతుందని బాలయ్య  అభిమానులు జోష్ మీద ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్ వచ్చింది. దాంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు బోయపాటి రీచ్ అవుతాడా.. బాలయ్యకు హాట్రిక్ హిట్ ఇస్తాడా లేదా చూడాలి.

More Related Stories