English   

బాలయ్య రాజేసిన నిప్పురవ్వ మండేలా కనిపిస్తుంది.

 Balakrishna
2020-06-04 16:28:18

తెలుగు ఇండస్ట్రీలో వివాదాలు లేవు.. అందరూ ఒకటే.. మేమంతా ఒకే కుటుంబం.. హీరోల మధ్య వివాదాలు కానీ విభేదాలు కానీ అస్సలు లేవు.. కేవలం అభిమానులు మాత్రమే కొట్టుకుంటారు.. ఇవే ఏ ఫంక్షన్ లో చూసిన మన హీరోలు చెప్పే మాటలు. కానీ పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి అని హీరోలు కూడా అప్పుడప్పుడు తమకు తెలియకుండానే నిరూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చొని భూములు పంచుకుంటున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ చాలా పెద్ద రచ్చ చేశాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే నిప్పురవ్వ రాజేసి వేడుక చూస్తున్నాడు బాలయ్య. ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు ఇంకా చాలానే ఉన్నాయని.. ఒక్కొక్కటిగా సమయాన్ని బట్టి బయటికి వస్తాయి అంటున్నారు విశ్లేషకులు.

తాజాగా బాలయ్య చేసిన కామెంట్స్ ను కొందరు హీరోలు దర్శకులు కావాలని వెనకేసుకొస్తున్నారు. దాన్ని బట్టి తామంతా బాలయ్య వర్గం అని వాళ్లు చెప్పకనే చెబుతున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ సహా చాలా మంది చిరంజీవిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే మేమంతా మెగాస్టార్ వెనక నడుస్తున్నామని వాళ్లు కూడా చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే చిరంజీవి-బాలకృష్ణ రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయారనేది చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది. మరి ఇండస్ట్రీలో రెండు గ్రూపులు ఇలా విడిపోయి ఎవరి దారి వాళ్లు చూసుకుంటే మధ్యలో కొందరు మాత్రం అంతా ఒక్కటే అని ఇప్పటికీ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 

మరోవైపు ఈ మధ్య బాలకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన విషయాలు చెప్పాడు. మా అసోసియేషన్ బిల్డింగ్ ఎందుకు పెట్టలేకపోతున్నారు.. తలచుకుంటే ఆర్టిస్టులు అంతా కలిసి కట్టలేరా.. దానికి విరాళాలు కావాలా.. అమెరికా వెళ్లి 5 కోట్లు అని కోటి రూపాయలు తీసుకొచ్చారు.. దానికి కూడా లెక్క పత్రం లేదు.. ఇప్పుడు ఇవన్నీ ఎవడు చూసుకుంటూ కూర్చుంటాడు అంటూ చాలానే నిప్పురవ్వలు కాల్చి వదిలేశాడు బాలయ్య. అవి ఒక్కొక్కటిగా అంటుకోవడం మొదలుపెట్టాయి. ఇక రాబోయే కాలంలో ఇది ఎంత పెద్ద మంట అవుతుందనేది చూడాలి. 
 

More Related Stories