English   

అస‌లేంటి బాల‌కృష్ణ మొండి ధైర్యం..?

Balakrishna dare on NTR Bio Pic

బాల‌య్యకు మొండి ధైర్యం ఎక్కువే. త‌న‌కు న‌చ్చితే ముందు వెన‌క చూడ‌కుండా అవ‌కాశాలు ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు.. చేసాడు కూడా. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీసుకెళ్లి తేజ చేతుల్లో పెట్టాడు ముందు.. ఆ త‌ర్వాత క్రిష్ ను ర‌మ్మ‌న్నాడు. క్రిష్ వ‌చ్చేస‌రికి నందమూరి ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేస్తామంటూ హామీ ఇచ్చాడు. అంత‌వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఇప్ప‌టికే వినాయ‌క్ సినిమా లైన్ లో ఉంది క‌దా.. దీన్ని సెప్టెంబ‌ర్ లోపు పూర్తి చేస్తానంటాడు. అంటే ఇంకా టైమ్ మూడు నెల‌లే ఉంది. కానీ వినాయ‌క్ కు అదే స‌రిపోతుందంటున్నాడు. అస‌లే ఈయ‌న‌కు ఇప్పుడు హిట్లు లేవు.. పైగా మూన్నెళ్ల‌లో సినిమా అంటే ఏం చేస్తాడు..? స‌రే ఈ చిత్రం ఎలా వ‌చ్చినా ప‌ర్లేదు కానీ బాల‌య్య ప్ర‌స్టేజియ‌స్ గా భావిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కు మూడు నెల‌లు స‌రిపోతాయా.. అవ‌త‌ల సావిత్రి బ‌యోపిక్ కోసం నాగ్ అశ్విన్ ఏకంగా రెండేళ్లు తీసుకున్నాడు. మ‌రి అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం క్రిష్ ఇంకెన్నాళ్లు తీసుకోవాలి..? అవేవీ కాదు.. మూడంటే మూడే నెల‌ల్లో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అని ప్ర‌తిజ్ఞ చేస్తున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి లాంటి  చ‌రిత్ర‌ను 78 రోజుల్లో తీసాడు క్రిష్. మ‌రి ఇప్పుడు పెద్దాయ‌న జీవితాన్ని కూడా అంతే వేగంగా తీస్తాడో లేదో చూడాలిక‌..!

More Related Stories