English   

రాజ‌కీయాల్లోకి బాల‌య్య అల్లుడు.. !!

balakrishna-01
2018-07-02 21:02:30

మెగా ఇంటి నుంచి అల్లుళ్లు హీరోలు అవుతుంటే.. నంద‌మూరి అల్లుళ్ళు మాత్రం రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మెగా చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత‌గా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. కానీ బాల‌య్య చిన్న‌ల్లుడు భ‌ర‌త్ మాత్రం పాలిటిక్స్ లోకి వ‌స్తున్న‌ట్లు తెలుస్తుంది. బాల‌కృష్ణ చిన్న కుమార్తె తేజ‌స్వి భ‌ర్త భ‌ర‌త్ ఇప్పుడు వైజాగ్ నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బాల‌య్య పెద్ద‌ల్లుడు నారా లోకేష్.. ఐటిశాఖ మంత్రిగా ఉన్నాడు. చంద్ర‌బాబు కొడుకు కావ‌డంతో లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు వ‌చ్చిన ఇబ్బందేం లేదు.

ఇక ఇప్పుడు చిన్న‌ల్లుడు కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి పోటీ చేసేందుకు గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి ఆస‌క్తి చూపిస్తున్నాడు. త‌న‌కి అది కుద‌ర‌ని ప‌క్షంలో త‌న వార‌సుడు.. మ‌న‌వ‌డు.. బాల‌య్య చిన్న‌ల్లుడు అయిన భరత్ కు సీట్ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా గంటా శ్రీ‌నివాస్ కు మంచి ప‌ట్టుంది. వైజాగ్ రాజ‌కీయాల్లో సిద్ధ‌హ‌స్తుడు ఈయ‌న‌. అయితే ఈ సారి ఈయ‌న్ని అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకు పంపాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది. అదే స‌మ‌యంలో బాల‌య్య మాత్రం త‌న చిన్న‌ల్లుడు భ‌ర‌త్ కు ఈ స్థానం ద‌క్కేలా పావులు క‌దుపుతున్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి దీనికి బావ చంద్ర‌బాబు ఏం అంటాడ‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More Related Stories