English   

ఎన్టీఆర్ కు ఏఎన్నార్ దొరికాడు

Balakrishna Got ANR For NTR Biopic

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సినిమా ‘ఎన్టీఆర్’. కారణం.. ఇది మహానటుడు, గొప్ప రాజకీయ వేత్త అయిన నందమూరి తారకరామారావు బయోపిక్ కావడమే. ఇక టైటిల్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్ అని తెలిసిందో.. అప్పుడే దీని రేంజ్ ఎక్కడికో పోయింది. ఓవర్శీస్ లోనే దాదాపు 12-15కోట్ల వరకూ రైట్స్ పలుకుతోందీ సినిమా. ఎన్టీఆర్ జీవితంలో వివిధ దశలను చర్చిస్తూ ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ(అంతకు మించి వెళితే లక్ష్మీ పార్వతి ఎంటర్ కావాల్సి ఉంటుందని) ఈ కథ సాగుతుందని ఇప్పటికే తేల్చేశారు. దీంతో ఒక మసాలా ఎపిసోడ్ మిస్ అయినట్టే అనుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు పై ఉన్న అభియోగం కూడా సినిమాలో కనిపించే అవకాశం లేదు. ఆ విషయం పక్కన బెడితే ఎన్టీఆర్ ఫిలిమ్ కెరీర్ లో అత్యంత ముఖ్యమైన పాత్ర అక్కినేని నాగేశ్వరరావుది. ఈ ఇద్దరినీ తెలుగు సినిమాక రెండు కళ్లుగా చెప్పుకున్నారు. అలాంటిది ఏఎన్నార్ పాత్ర సాధారణంగా ఉండే అవకాశం లేదు. అందుకే ఈ పాత్ర కోసం చాలాకాలంగా ఎవర్ని తీసుకోవాలా అని కసరత్తులు చేస్తున్నారు. కొన్నాళ్లుగా సుమంత్ చేస్తాడని వినిపించింది.. బట్ ఇప్పుడు ఆ పాత్ర చేస్తున్నది ఎవరో తేలిపోయింది.

నిజానికి వారసులు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. అందువల్ల వారి పాత్రలు వారి వారసులే వేస్తే బావుటుంది. కాస్త హైప్ కూడా వస్తుంది. అందుకే అక్కినేని పాత్రలో సుమంత్ కోసం ట్రై చేశారు. ముందు కాస్త ఆలోచించినా ఫైనల్ గా సుమంతే ఆ పాత్ర చేస్తున్నాడు. నిజానికి ఏఎన్నార్ కు అందరికంటే సుమంత్ అంటేనే ఎక్కువ ఇష్టం అంటారు. మొత్తంగా ఈ పాత్ర తానే చేస్తున్నట్టు సుమంత్ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఆ పాత్రకు సంబంధించిన సస్పెన్షన్ కు తెరపడినట్లైంది.

ఇక ఇతర పాత్రల్లో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారు.. కానీ ఫైనల్ కాలేదు. అలాగే కృష్ణ క్యారెక్టరూ తేలలేదు.. యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ కన్ఫార్మ్ అయ్యాడు. అలాగే రామానాయుడు పాత్రలో వెంకటేష్ ఓకే చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తాడని లేటెస్ట్ గా తేలిపోయింది. మరి మిగిలిన పాత్రల్లో నటించేవారెవరో చూడాలి.

More Related Stories