English   

బాబాయ్ అబ్బాయ్ ల మ‌ల్టీస్టార‌ర్

Balakrishna
2021-05-04 14:21:34

నంద‌మూరి బాల‌క్రిష్ణ ప్ర‌స్తుతం అఖండ సినిమాలో న‌టిస్తున్నారు. కరోనా వేళ హీరోలంగా ఇంటికే ప‌రిమితం అయినా బాల‌య్య భ‌య‌ప‌డకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా త‌ర‌వాత బాల‌క్రిష్ణ అనిల్ రావిపూడి సినిమాలో న‌టించ‌బోతున్నారు. ఇప్పటివ‌ర‌కూ దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినప్ప‌టికీ దాదాపు ఖరారైన‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అఖండ సినిమా పూర్త‌వ‌గానే ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ట‌.

 అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాల‌క్రిష్ణ‌తో పాటు క‌ల్యాణ్ రామ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే బాల‌య్య‌కు క‌థ వినిపించిన అనిల్ రావిపూడి ఇటీవ‌ల క‌ల్యాణ్ రామ్ కు కూడా క‌థ ను వినిపించిన‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక నిజానికి అనిల్ రావిపూడిని ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిందే క‌ల్యాణ్ రామ్ కావ‌డం విశేషం. దాంతో క‌ల్యాణ్ రామ్ తో ఎప్ప‌టినుండో ఓ సినిమా చేయాల‌ని రావిపూడి అనుకుంటున్నార‌ట‌. 

ఈ నేప‌థ్యంలోనే బాబాయ్ అబ్బాయ్ ల‌ను రావిపూడి సెట్ చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా వీరి కోసం ఎఫ్ 2 లాంటి ఓ క‌థ‌ను అనిల్ రావిపూడి సిద్ధం చేసుకున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా అప్ప‌ట్లో ఓ ఇంట‌ర్యూకు వ‌చ్చిన అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాల‌య్య ఇదివ‌ర‌కు ఎప్పుడూ క‌నిపించ‌ని పాత్ర‌లో న‌టిస్తార‌ని చెప్పారు. కానీ మ‌ల్టీస్టారర్ అని మాత్రం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. 

More Related Stories