English   

బాల‌య్య మ‌న‌దేశంతో మొదలుపెట్టాడు

ntrbiopic
2018-07-05 19:43:59

నంద‌మూరి బాల‌క్రిష్ణ హీరోగా తెర‌కెక్కుతోన్న ఎన్టీఆర్ సినిమా ప్రారంభ‌మైంది. నంద‌మూరి తారక‌రామారావు బ‌యోపిక్ గా రాబోతోన్న ఈమూవీలో తండ్రి పాత్ర‌ను బాల‌య్యే చేస్తున్నాడ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. మొత్తంగా అనౌన్స్ మెంట్ త‌ర్వాత ర‌క‌ర‌కాల స‌మ‌స్యలు ఎదుర్కొన్న ఎన్టీఆర్ మూవీ చివ‌రికి ద‌ర్శ‌కుడు క్రిష్ చేతిలో ప‌డింది. ఆల్ర‌డీ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో బాల‌య్య వందో చిత్రంగా వ‌చ్చిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి చ‌రిత్ర స్రుష్టించింది. ఈ నేప‌థ్యంలో్ ఇది ఎన్టీఆర్ బ‌యోపిక్ కావ‌డంతో క్రిష్ అయితే హండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం  చేస్తాడ‌ని అంతా భావిస్తున్నారు. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌ల కోసం వేర్వేరు భాష‌ల న‌టుల‌ను కూడా తీసుకుంటున్నాడు క్రిష్‌.

ఇక ఎన్టీఆర్ స‌తీమ‌ణిగా బాలీవుడ్ బ్యూటీ విద్యా బాల‌న్ ఇప్ప‌టికే ఖ‌రారైంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో సుమంత్ న‌టించే అవ‌కాశం ఉంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. మొత్తంగా క్రిష్ సీన్ లోకి వ‌చ్చిన త‌ర్వాత ఇవాళ ఫ‌స్ట్ డే షూటింగ్ జ‌రింగింది. ఎన్టీఆర్ మొద‌టి సినిమా మ‌న‌దేశం కు సంబంధించిన ప్రొఫైల్ లుక్ లో బాల‌య్య అచ్చం అలానే ఉన్నాడు.  ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఫ‌స్ట్ లుక్ తో పాటు.. నాడూ నేడూ మ‌న‌దేశంతోనే శ్రీకారం అనే లైన్ తో *అభిమానమును మించిన ధ‌న‌ము.. ఆద‌ర‌మును మించిన పెన్నిది ఈ లోక‌మున లేదు.. ఇంద‌రి సోద‌రుల ప్రేమానురాగ‌ములు పొందుకోగ‌లుగుట ఈ జ‌న్మ‌కు నేను పొందిన వ‌రం.. మీకు స‌దా రుణ‌ప‌డ్డ‌ట్టే* అంటూ ఎన్టీఆర్ లెట‌ర్ హెడ్ తో ఉన్న ఓ స్టేట్మెంట్ కూడా విడుద‌ల చేశారు. కింద తెలుగువారంద‌రి ఆశిష్సులు కోరుతూ మీ     నంద‌మూరి బాల‌క్రిష్ణ‌, జాగ‌ర్ల‌మూడి క్రిష్  మ‌రి ఈ బ‌యోపిక్ తెలుగులో ఎలాంటి సంచ‌ల‌నాలు స్రుష్టిస్తుందో చూడాలి. 

More Related Stories