English   

 తండ్రితో ఆడుకుంటున్న బాల‌య్య‌..

Balakrishna-teja

మాట‌కు ముందు నాన్న‌గారు.. మాట త‌ర్వాత నాన్న‌గారు అంటుంటాడు బాల‌కృష్ణ‌. త‌న‌కు గురువు దైవం అన్నీ తండ్రే అని చెప్తాడు బాల‌య్య‌. ఈ జీవితాన్ని అందించిన నాన్న‌కు ఏం ఇచ్చి రుణం తీర్చుకోగ‌ల‌ను అని చెబుతుంటాడు ఈ హీరో. ఇప్పుడు తండ్రి బ‌యోపిక్ ను తెర‌కెక్కించి.. కొడుకు గా త‌న బాధ్య‌త నెర‌వేరుస్తున్నాన‌ని ఈ మ‌ధ్యే చెప్పాడు బాల‌య్య‌. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం అన్నీ తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు ఈ హీరో. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ కూడా అనుకున్నారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఇది తెర‌కెక్క‌బోతుంది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అనుకోని ఇబ్బంది ఒక‌టి ఎదురైంది. దానిపేరు వివి వినాయ‌క్. అవును.. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కు అనుకోని విధంగా అడ్డొస్తున్నాడు వినాయ‌క్. బాల‌కృష్ణ‌తో ఈ ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నిర్మాత సి క‌ళ్యాణ్ జై సింహా 100 రోజుల వేడుక‌లో స్టేజ్ పై అనౌన్స్ చేసాడు. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ మొద‌లుపెట్టి సంక్రాంతికి సినిమా విడుద‌ల చేస్తామ‌ని చెప్పాడు. మ‌రోవైపు అదే నెల నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా ప‌ట్టాలెక్కాలి. ద‌స‌రాకు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో స‌డ‌న్ గా వినాయ‌క్ సీన్ లోకి రావ‌డం ఏంటో మ‌రి బాల‌య్య‌కే తెలియాలి. ఇదే గానీ జ‌రిగితే తండ్రి బ‌యోపిక్ తో పాటు వినాయ‌క్ సినిమాను ఒకేసారి బాల‌య్య బ్యాలెన్స్ చేస్తాడా..? అలా చేస్తే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది క‌దా..? ఇదే ఇప్పుడు అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న విష‌యం. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి బాల‌య్య ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో..? 

More Related Stories