English   

ఎన్టీఆర్ బయోపిక్ గురించి కొత్త వార్త

Balakrishna NTR Biopic Movie

నందమూరి తారకరామారావు బయోపిక్ గా తెరకెక్కుతోన్న సినిమా ఎన్టీఆర్. రీసెంట్ గా మొదలైన ఈ మూవీ అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఏంటీ షాక్ అయ్యారా.. బట్ ఇది నిజం.. ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. వెంటనే నెక్ట్స్ షెడ్యూల్ కు సిద్ధమవుతోందీ సినిమా. ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండటం విశేషం. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో విద్యాబాలన్ కూడా నటించింది. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, నరేష్, మురళీ శర్మ, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటు టెక్నికల్ గానూ టాప్ టీమ్ పనిచేస్తోందీ సినిమాకు. ఇప్పటికే బిజినస్ పరంగా వంద కోట్ల వరకూ బిజినెస్ డీల్స్ వస్తున్నాయీ సినిమాకు. ఆల్రెడీ బాలయ్య, క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి క్రేజ్ ను ఈ మూవీ డబుల్ చేస్తోందనుకోవచ్చు.

నందమూరి బాలకృష్ణతో పాటు సాయి కొర్రపాటి కూడా ఈ మూవీ ప్రొడక్షన్ భాగస్వామిగా ఉన్నాడు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ ఇంత వేగంగా పూర్తవుతోందంటే అదంతా బాలయ్య ప్రతిభే అనుకోవాలి. ఓ టాప్ హీరో అయి ఉండి కూడా క్రిష్ ను ఫాలో అవుతూ సినిమా స్పీడ్ గా పూర్తి కావడానికి సహకరిస్తున్నాడు. మొత్తంగా ఈ మూవీ అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందనే వార్త టాలీవుడ్ లోనే సెన్షేషనల్ గా మారిందని చెప్పొచ్చు

More Related Stories