English   

ఎన్టీఆర్ బ‌యోపిక్.. మ‌రో న‌ర్త‌న‌శాల‌..

NTR-biopic

ఎన్టీఆర్ బ‌యోపిక్ కు న‌ర్త‌న‌శాల‌కు సంబంధం ఏంటి..? అంత పెద్ద విజ‌యం సాదిస్తుంద‌ని చెబుతున్నారా.. లేదంటే న‌ర్త‌న‌శాల‌లా ఇది కూడా మ‌ధ్య లోనే ఆపేస్తున్నాడు బాల‌య్య అని హింట్ ఇస్తున్నారా అనుకుంటున్నారా..? అయితే ఆ రెండోదే ఖాయం చేసుకోండి. అవును.. ఎన్టీఆర్ బ‌యోపిక్ వార్త‌ల్లోనే మిగిలిపోయేలా క‌నిపిస్తుంది. ఇది కార్య‌రూపం దాల్చ‌డం క‌ష్టంగా క‌నిపిస్తుంది. మాట‌కు ముందు నాన్న‌గారు.. మాట త‌ర్వాత నాన్న‌గారు అంటుంటాడు బాల‌కృష్ణ‌. త‌న‌కు గురువు దైవం అన్నీ తండ్రే అని చెప్తాడు బాల‌య్య‌. ఈ జీవితాన్ని అందించిన నాన్న‌కు ఏం ఇచ్చి రుణం తీర్చుకో గ‌ల‌ను అని చెబుతుంటాడు ఈ హీరో. ఇప్పుడు తండ్రి బ‌యోపిక్ ను తెర‌కెక్కించి.. కొడుకు గా త‌న బాధ్య‌త నెర‌వేరుస్తున్నాన‌ని ఈ మ‌ధ్యే చెప్పాడు బాల‌య్య‌. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం అన్నీ తానే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు ఈ హీరో. అంతా బాగానే ఉంది అనుకుంటున్న త‌రుణంలో తేజ ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్నాడు. 

దాంతో ఎన్టీఆర్ బ‌యోపిక్ కు ద‌ర్శ‌కుడు కరువ‌య్యాడు. దాంతో సింపుల్ గా తాను కూడా త‌ప్పుకుని వినాయ‌క్ సినిమాకు సై అనేసాడు. ఈ చిత్రం మే 27న మొద‌లు కానుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నిర్మాత సి క‌ళ్యాణ్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ మొద‌లుపెట్టి సంక్రాంతికి సినిమా విడుద‌ల చేస్తామ‌ని చెప్పాడు. మ‌రోవైపు అదే నెల నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా ప‌ట్టాలెక్కాలి. ద‌స‌రాకు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో స‌డ‌న్ గా వినాయ‌క్ సీన్ లోకి రావ‌డం ఏంటో మ‌రి బాల‌య్య‌కే తెలియాలి. ఇదే గానీ జ‌రిగితే తండ్రి బ‌యోపిక్ ను ప‌క్క‌న‌బెట్టి.. వినాయ‌క్ సినిమాను బాల‌య్య ముందుకు తీసుకెళ్తాడేమో..? గ‌తంలోనూ న‌ర్త‌న‌శాల సినిమాను త‌న ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లు పెట్టి ఆపేసాడు బాల‌య్య‌. మ‌రి ఈ సారి ఏం చేస్తాడో..? 

More Related Stories