English   

బాల‌య్య‌.. అది సాధ్య‌మేనా..?

balakrishna

అనుకుంటే కానిది ఏమున్న‌ది.. మ‌నిషి అనుకుంటే కానిది ఏమున్న‌ది అంటూ ఆ మ‌ధ్య ఓ సినీ క‌వి పాట రాసాడు. ఇప్పుడు దాన్ని అచ్చంగా ఫాలో అయిపోతున్నాడు బాల‌య్య‌. మ‌నం అనుకుంటే కానిది ఏదీ లేదంటూ రెచ్చిపోతున్నాడు నంద‌మూరి న‌ట‌సింహం. 58 ఏళ్ల‌కు ఈయ‌న జోరు చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. ఈ ఏజ్ లో ఏడాదికి ఒక్క సినిమా చేయ‌డానికే వెంక‌టేశ్, చిరు, నాగ్ క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ బాల‌య్య మాత్రం ఇప్ప‌టికీ నాన్ స్టాప్ గా రెచ్చిపోతున్నారు. ఆర్నెళ్లుగా రెస్ట్ తీసుకుంటున్నాడేమో అనుకుంటే.. వ‌చ్చే తొమ్మిది నెల‌ల్లో ఏకంగా మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు బాల‌య్య‌. దీనికి స్కెచ్ కూడా వేసాడు ఈ హీరో. ఇప్ప‌టికే వినాయ‌క్ సినిమాకు ముహూర్తం పెట్టేసాడు బాల‌య్య‌. ఈ చిత్రాన్ని మూడంటే మూడే నెల‌ల్లో పూర్తి చేసి ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది బాల‌య్య ప్లాన్. ఈ సినిమా జులై నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. వినాయ‌క్ సినిమాతో పాటే ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేలా ఉన్నాడు బాల‌య్య‌. కుదిర్తే రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయ‌నున్నాడు కూడా. అక్టోబ‌ర్ నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లు పెట్టి సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నాడు బాల‌య్య‌. ఇప్ప‌ట్నుంచి ద‌స‌రా వ‌ర‌కు వినాయ‌క్.. అక్టోబ‌ర్ నుంచి సంక్రాంతి వ‌ర‌కు క్రిష్ సినిమాలు ఉంటాయి. ఇక జ‌న‌వ‌రి నుంచి బోయ‌పాటి సినిమాకు ముహూర్తం పెట్ట‌నున్నాడు బాల‌య్య‌. అప్పుడు మొద‌లు పెట్టి నాలుగు నెల‌ల్లో ఈ సినిమా పూర్తిచేసి ఎన్నిక‌ల ముందు విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడు బాల‌కృష్ణ‌. ప్లానింగ్ విన‌డానికి ఇల్లు కట్టినంత అందంగా ఉంది. అది వ‌ర్క‌వుట్ అయితే మాత్రం అద్భుత‌మే.

More Related Stories