English   

మీడియాపై బాలయ్య షాకింగ్ కామెంట్స్

Balakrishna
2021-01-18 15:57:10

స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్థంతి సంధర్భంగా బాలకృష్ణ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంటే సూర్యుణ్ణి వేలెత్తి చూపడంలాంటిదని..అంతగొప్ప జీవితం ఆయనది అంటూ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఎంతో గొప్పవ్యక్తి అని ఎన్ని కష్టాలు వచ్చినా ఆధరక బెదరక ఎదురుకున్నారని ఆయన తండ్రిని బాలయ్య గుర్తు చేసుకున్నారు.  తనకు ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే ఎన్టీఆర్ అమర్ రహే అని గట్టిగా మూడు సార్లు అంటానని బాలయ్య చెప్పారు. 

అయితే మీడియాతో మాట్లాడే సమయంలో బాలకృష్ణ అసహనానికి లోనయ్యారు. బాలయ్య కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరడంతో మీడియా ఛానల్స్ కవరేజ్ కోసం పోటీ పడ్డాయి. దాంతో బాలకృష్ణ అసహనానికి లోనయ్యారు. బాలయ్య మాట్లాడుతున్న సమయంలో మీడియా సిబ్బంది కాస్త ముందు రండి సార్ అంటూ చెప్పడంతో.. చాలు చాల్లే మీ సలహాలు. సూది జెజ్జం అంత చోటిస్తే చెవిలో ఉక్కుచ్చపోసే రకాలు మీరు అంటూ వ్యాఖ్యలు చేసారు. 

More Related Stories