English   

ఏంది బాల‌య్య ఇది.. ఎన్ని సినిమాలు..? 

balakrishna-ntr

సాధార‌ణంగా 60 ఏళ్లంటే రిటైర్మెంట్ ఏజ్. ఇన్నాళ్లూ క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టి ఇక చాలు ఇంట్లో కూర్చుని హాయిగా ఉండండి అని చెప్పే ఏజ్ అది. కానీ ఈ ఏజ్ లోనే అస‌లు ఆట చూపిస్తున్నాడు బాల‌కృష్ణ‌. వ‌య‌సు 60 కి చేరువ‌వుతుంటే ఈయ‌న జోరు 20కి వ‌స్తుంది. బాల‌య్య‌ను చూసి కుర్ర హీరోలు కూడా కుళ్ల‌కుంటున్నారు ఇప్పుడు. జై సింహాతో పండ‌క్కి హిట్ కొట్టిన బాల‌య్య‌.. చాలా ఏళ్ళ త‌ర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు. ఆగ‌స్ట్ లో కానీ కొత్త సినిమాకు కొబ్బ‌రికాయ్ కొట్ట‌డు బాల‌య్య‌. దాంతో కొన్ని రోజుల పాటు రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టాడు బాల‌య్య‌. ఆగ‌స్ట్ నుంచి ఎన్టీఆర్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది. తేజ ద‌ర్శ‌కుడు. 

ఎన్టీఆర్ బ‌యోపిక్ తో పాటు మ‌రో మూడు సినిమాలు కూడా ఇప్పుడు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే బాల‌య్య బ‌ర్త్ డే కానుక‌గా జూన్ 10న బోయ‌పాటి సినిమాకు ముహూర్తం పెట్ట‌నున్నారు. ఇక ఈ సినిమాతో పాటు వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డితో బాల‌య్య ఓ సినిమా చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అప్ప‌ట్లో బాల‌య్య టాప్ స్పీడ్ లో ఉన్న‌పుడు టాప్ హీరో లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌ఫ్టీ రీమేక్ లో బాల‌య్య న‌టించ‌నున్నార‌నే వార్త‌లొస్తున్నాయి. వీటితో పాటు పూరీ జ‌గ‌న్నాథ్ తోనూ బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్నాడు. మొత్తానికి మ‌రో రెండేళ్ల పాటు బాల‌య్య దూకుడు మామూలుగా లేదు.

More Related Stories