English   

బాలయ్యకు ఆ విషయంలో ఇక కష్టాలు తీరిపోయినట్లే..

nbk
2019-12-14 08:20:03

బాలయ్య ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేయస్ రవికుమార్ రూలర్ విడుదలకు సిద్ధంగా ఉండగానే బోయపాటి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమైపోయాడు. ఈ చిత్రం జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు కావాల్సినవన్ని సిద్ధం చేస్తున్నాడు ఈ దర్శకుడు. హీరోయిన్ వేట కూడా వేగంగానే సాగిసోతున్నాడు బోయపాటి. ఈ క్రమంలో కీర్తి సురేష్ ను ఇందులో హీరోయిన్ గా ఒప్పించే ప్రయత్నం చేసాడు బోయపాటి. కానీ బాలయ్యతో నటించడానికి ఆమె సున్నితంగా తిరస్కరించింది. దాంతో హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయని ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో కేథరిన్ థ్రెసాను అడగ్గా ఆమె వెంటనే ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బోయపాటి తెరకెక్కించిన సరైనోడు సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించింది.

దాంతో పాటే జయ జానకి నాయకా సినిమాలో ఐటం సాంగ్ కూడా చేసింది. దాంతో మళ్లీ ఇప్పుడు బోయపాటి సినిమాలో నటించడానికి కేథరిన్ ఒప్పుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది. ఆమె కోసం ఇంకా వేట సాగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రోజా కూడా నటిస్తుందని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి అటు బాలయ్య కానీ.. ఇటు బోయపాటి కానీ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఇద్దరూ లాభాల్లో షేర్ తీసుకుంటారని తెలుస్తుంది. సినిమాను కేవలం 25 కోట్ల లోపే పూర్తి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

More Related Stories