English   

ఎన్టీఆర్ సినిమాపై ఎన్ని ప్రశ్నలో..?

NTR-biopic

తెలుగు తెరపైనే కాదు, తెలుగు వారి జీవితాల్లో చెదరగని ముద్రను వేసిన ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడు ఎవరు అనేది బేతాళ ప్రశ్నలా మారింది.  తేజ తప్పుకున్నాక బాలయ్యే మెగా ఫోన్ పడతాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.  రాఘవేంద్రరావు, క్రిష్, పూరిజగన్నాథ్ పేర్లు కూడా ఈ కెప్టెన్ ఛైర్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే వీరు ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండటం తో మరో ఆరు నెలలు పాటు వీళ్ళ డేట్స్ దొరకని పరిస్థితి ఉంది.  మరి అప్పటి వరకూ ఎన్టీఆర్ బయోపిక్ కి బ్రేక్ లు పడక తప్పదా అంటున్నారు. బుర్రా సాయిమాధవ్ రచనా సహాకారం అందిస్తున్న ఈ మూవీ కి ఇప్పటి వరకూ బౌండ్ స్క్రిప్ట్ కూడా రెడీ కాలేదు. ఎన్ని గెటప్ లలో ఎన్టీయార్ కనిపించబోతున్నాడనే క్లారిటీ లేదు. మిగిలిన పాత్రలకు నటీ, నటుల ఎంపిక పూర్తవలేదు. ఇవేమీ ఖరారు కాకుండానే దసరాకి సినిమా అని అనౌన్స్ చేసి మరింత గందరగోళ వాతావరణం సృష్టించింది యూనిట్.  మరి ఎన్టీయార్  బయోపిక్ మరో నర్తనశాల కాబోతుందా అనే అనుమానాలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడతున్నాయి. మరో వైపు సినిమాలో కేవలం 40శాతం మటుకే షూటింగ్ జరుపుతారని, మిగిలిన కథంతా ఎన్టీయార్ క్లిప్స్ వాడతారనే మాటలు వినిపిస్తున్నాయి.  తెలుగు చరిత్రకు గర్వ కారణంగా నిలిచిన ఎన్టీఆర్ జీవితం వెండితెరపై కథగా మారడం తెలుగు వారికి ఆనందం అయితే అది సక్రమంగా మారుతుందా అనేది ఇప్పుడు అందరిని తొలిచి వేస్తున్న ప్రశ్నలు...?
 

More Related Stories