English   

మరోసారి తెలుగమ్మాయితో బాలయ్య రొమాన్స్..

Balakrishna
2020-09-11 09:06:49

హీరోయిన్స్ ను రిపీట్ చేసే అలవాటు తెలుగు ఇండస్ట్రీలో బాలయ్యకు మాత్రమే ఉంది. ఇప్పుడున్న హీరోలు ఓసారి నటించిన తర్వాత మళ్లీ వాళ్లతోనే రొమాన్స్ అంటే ఆలోచిస్తుంటారు. అయితే సీనియర్ హీరోలకు ఆ ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు హీరోయిన్స్ దొరకడం కూడా గగనం అయిపోయింది. వాళ్లు చేసే సినిమాలకు కథలు ఈజీగానే వస్తున్నాయి కానీ ఆ కథలో హీరోయిన్ మాత్రం కష్టంగా ఉంది. ఎందుకంటే వయసుకు తగ్గట్లుగా ఉండే ముద్దుగుమ్మల కోసం నానా యాతన పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య సినిమాలో మరోసారి పాత హీరోయిన్ నే ఎంపిక చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా బాలయ్య కూడా నటించిన హీరోయిన్స్ తోనే ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోనాల్ చౌహాన్.

లెజెండ్ తర్వాత ఆమెకు డిక్టేటర్, రూలర్ సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు బాలయ్య. శ్రీయకు ఒకే ఏడాది శాతకర్ణి, పైసా వసూల్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు అంజలి విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న బోయపాటి సినిమాలో హీరోయిన్ గా అంజలి పేరు వినిపిస్తుంది. గతంలోనే డిక్టేటర్ సినిమాలో కలిసి నటించారు బాలయ్య, అంజలి. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.. కానీ అంజలి మాత్రం బాలయ్యకు బాగానే కనెక్ఠ్ అయిపోయింది. దాంతో మరోసారి ఈమెతో నటించడానికి బాలయ్య ఆసక్తి చూపిస్తున్నాడు. షూటింగ్ కు కూడా త్వరలోనే రానున్నాడు ఈ హీరో. బసవతారకం వైద్యుల పర్మిషన్ కోసం చూస్తున్నాడు ఈయన. 

More Related Stories