English   

బాల‌య్య మ‌ఫ్టీలో ఉన్న ఏకే47

balayya next titled as AK47
2018-06-13 16:56:46

ఏకే 47.. ఈ పేరులో ఎంత ప‌వ‌ర్ ఉంటుందో వేరే చెప్ప‌క్క‌ర్లేదు. మోస్ట్ ప‌వ‌ర్ టైటిల్ అన‌డంలోనూ ఎలాంటి డౌట్ లేదు. ప్ర‌స్తుతం ఏజ్ 57దాటినా.. ఏకే 47 లాంటి స్పీడ్ తో దూసుకుపోతోన్న బాల‌య్య ఇప్పుడు ఇదే టైటిల్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌నే టాక్ టాలీవుడ్ లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. అయితే ఇది ఓ క‌న్న‌డ సూప‌ర్ హిట్ సినిమాకు రీమేక్ అనేది ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌ర‌జా్ కుమార్, రోరింగ్ స్టార్ శ్రీ మురళి ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన ఆ సిన‌మా మ‌ఫ్టీ. లాస్ట్ ఇయ‌ర్ విడుద‌లైన మ‌ఫ్టీ శాండ‌ల్ వుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది.  శివ‌రాజ్ కుమార్ ఓ గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించిన ఈ సిఇన‌మాలో శ్రీ ముర‌ళి అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి మ‌ఫ్టీలో అత‌ని గ్యాంగ్ లో చేరే పోలీస్ గా శ్రీ ముర‌ళి న‌టించాడు. సీరియ‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా మ‌ఫ్టీని తెలుగులో రీమేక్ చేయాల‌ని చాలామంది చూశారు. ఫైన‌ల్ గా బాల‌య్య హీరోగా వివి వినాయక్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతోంద‌ని.. ఈ చిత్రానికే ఏకే 47 అనే పేరు పెట్టార‌ని వినిపిస్తోంది. అయితే ఒరిజిన‌ల్ లో శివ‌న్న కంటే శ్రీ ముర‌ళికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ తెలుగులో దాన్ని మార్చేస్తున్నార‌ని టాక్.

ఇక గ‌తంలో బాల‌య్య‌, వినాయ‌క్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చెన్నకేశ‌వ‌రెడ్డి అంచ‌నాల‌ను పూర్తిగా అందుకోలేక‌పోయింది. ఈ సారి ఆలోటును తీర్చాల‌ని వినాయ‌క్ క‌సిగా ఉన్నాడు. ఇటు విన‌య్ కూడా వ‌రుస డిజాస్ట‌ర్స్ తో ఉన్నాడు. ఈ ఏకే 47తో ఒకేసారి బాల‌య్య‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చి.. త‌న రేంజ్ నూ మార్చుకోవాల‌ని చూస్తున్న‌ట్టు టాక్.. సి క‌ళ్యాణ్ నిర్మించబోతోన్న ప్ర‌స్తుతం బాల‌య్య‌, క్రిష్ కాంబినేష‌న్ లో రూపొంద‌బోతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ పూర్తి కాగానే మొద‌లుపెడతార‌ని వినిపిస్తోంది. 

More Related Stories