బాలు, రాజాలను కలుపుతున్న విశాల్..

విశాల్ ఈ మధ్య తమిళనాట రియల్ హీరో అయిపోయాడు. ఎక్కడ సమస్య కనబడితే అక్కడ వాలిపోతున్నాడు. పైగా నడిగర్ సంఘం ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఆ బాధ్యతను మరింత ఎక్కువగా తీసుకుంటున్నాడు విశాల్. ఇండస్ట్రీకి కష్టం వస్తే చాలు సొంతింటికి కష్టమొచ్చినట్లు ఫీలైపోతున్నాడు. ఇప్పుడు కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా మధ్య ట్యూన్స్ గొడవలోకి వెళ్తున్నాడు విశాల్. ఈ ఇద్దరినీ కలపడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు విశాల్. తమిళ ఆర్టిస్టుల బాగోగుల కోసం నడిగర్ సంఘం నిధుల కోసం ఓ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు విశాల్. దీనికి ఇళయరాజా, బాలుతో పాటలు పాడించాలని చూస్తున్నాడు విశాల్. ఇప్పటికే ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి ఈ ఇద్దరి ముందు పెట్టాడు విశాల్. ఇప్పుడు వాళ్ల నుంచే కన్ఫర్మేషన్ రావాలి. నడిగర్ సంఘం కోసం కావడంతో బాలు, రాజా సైతం ఈ ప్రోగ్రామ్ కు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన పాటలు స్టేజీపై పాడొద్దంటూ ఈ మధ్య బాలుకు నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇప్పుడు మ్యూజికల్ నైట్ చేస్తూ తన పాటల్నే బాలుతో స్టేజీపై పాడిస్తాడు. మొత్తానికి విశాల్ బుర్రే బుర్ర.. ఒక్క దెబ్బతో రెండు పిట్టలంటే ఇదే మరి. నిధులకు నిధులు.. బాలు, రాజా ఫ్రెండ్ షిప్ మళ్లీ కలిపినట్లూ ఉంటుంది.