English   

భరత్ రామ్ విజన్ అదిరిందిగా..

Bharath Ane Nenu

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనే నేను ఫస్ట్ విజన్ వచ్చేసింది. మాట తప్పిన వాడు మనిషే కాదు అన్న అమ్మ మాటకు జీవితమంతా కట్టుబడి ఉండే భరత్ అనే యువకుడి కథగా ఈ విజన్ చూస్తే తెలుస్తుంది. ఒకసారి ఓ పెద్ద మాట ఇవ్వాల్సి వస్తుంది. ఎంత కష్టమైనా ఆ మాటకూ కట్టుబడి ఉన్నానని, ఆ మాట కోసం ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తా అంటున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన రూమర్స్ అన్నీ నిజమే అన్నట్టుగా ఈ కథ రూరల్ ఎడ్యుకేషన్ సిస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే విషయం తెలుస్తోంది. అది విజన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. భరత్ రామ్ అనే నేను అంటోన్న మహేష్ రోరింగ్ వాయిస్ తో సొసైటీలో నివసిస్తోన్న ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలంటూ చెప్పే డైలాగ్ కేక అని చెప్పాలి.

కేవలం మహేష్ బాబును మాత్రమే హైలెట్ చేస్తూ సాగిన ఈ టీజర్ లో కొరటాల శివ టేకింగ్ అంతా గత సినిమాలను తలపిస్తోన్న కంటెంట్ ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల కంటే బలంగా ఉండేలా కనిపిస్తోంది. కొన్ని షాట్స్ చూస్తే అనివార్యంగా శ్రీమంతుడు గుర్తొస్తున్నా.. కథనంలో అవేవీ కనిపించకుండా జాగ్రత్త తీసుకుని ఉంటారనుకోవచ్చు. శ్రీమంతుడుతో గ్రామాల దత్తత కాన్సెప్ట్ ను అత్యంత బలంగా చెప్పిన కొరటాల శివ ఈ మూవీతో రూరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై సినిమాటిక్ అవేర్ నెస్ ను కూడా బలంగా తెస్తాడనిపిస్తోంది. ఈ సినిమా ఆ దిశగా కొందరిని కదిలించినా కొరటాల సూపర్ సక్సెస్ అయినట్టే.. మొత్తంగా మహేష్ బాబు ఈ సమ్మర్ ను షేక్ చేయబోతున్నాడనే విషయం టీజర్ చెప్పకనే చెబుతోంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్నఈ మూవీకి బలమైన ప్యాడింగ్ కూడా ఉంది. టెక్నికల్ గానూ హైక్వాలిటీ టెక్నీషియన్స్ ఉన్నారు. ఇవన్నీ కొరటాల శివ కంటెంట్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయగలిగితే అతని విజన్ బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ.. 

More Related Stories