English   

బండ్ల గణేష్ కు రెండోసారి కరోనా...ఐసీయూలో చికిత్స

Bandla Ganesh
2021-04-14 11:32:44

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పలువురు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నిర్మాత  దిల్ రాజు కు కరోనా పాజిటివ్ రావడం తో ఆయన ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సిబ్బంది లో పలువురు కరోనా బారిన పడటం తో పవన్ డాక్టర్ ల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. 

ఇక తాజా సమాచారం ప్రకారం నిర్మాత నటుడు బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. బండ్ల గణేష్ కు గతంలో కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే త్వరలోనే ఆయన కొలుకున్నారు. కాగా తాజాగా మరోసారి ఆయనకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాకుండా వకీల్ సాబ్ ఈవెంట్ కు వెళ్లి వచ్చిన మరుసటిరోజు నుండి బండ్ల తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుట్జున్నారట. ఇక కరోనా రావడం తో బండ్ల ను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్టు సమాచారం. అంతే కాకుండా ప్రస్తుతం ఐసీయూలో ఉన్న అతడికి డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది.

More Related Stories