English   

అదిరింది అల్లుడు నీ జోరు..

BellamKonda Sai Sreenivas

అల్లుడు అంటే ఇక్కడ బెల్లంకొండ శ్రీ‌నివాసే. ఈ హీరో తొలి సినిమా అల్లుడుశీను. ఈ సినిమా ప్లాపైనా కూడా మ‌నోడు హీరోగా రిజిష్ట‌ర్ అయ్యాడు. ఇదే స్పీడ్ ప్ర‌తీ సినిమాకు చూపిస్తున్నాడు. పైగా కొండంత బెల్లంకొండ అండ ఉండ‌నే ఉంది. దాంతో ఆపేవాడే లేడు ఈ కుర్రాన్ని. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే సాక్ష్యం సినిమాను పూర్తిచేసిన బెల్లంకొండ‌.. ఇప్పుడు మ‌రో సినిమా మొద‌లుపెట్టాడు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ చెప్పిన క‌థ న‌చ్చి మ‌రో సినిమా స్టార్ట్ చేసాడు ఈ కుర్ర హీరో. రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాకు ముహూర్తం కూడా పెట్టారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చ్ నుంచి మొద‌లు కానుంది. సినిమా ఇదే ఏడాది విడుద‌ల కానుంది. ఈ సినిమా కొత్త క‌థ‌తో తెర‌కెక్క‌నుంది. రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలా సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు చూడ‌ర‌ని అర్థం చేసుకున్న‌ట్లున్నాడు ఈ వార‌సుడు. అందుకే కొత్త‌గా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు న‌టిస్తోన్న సాక్ష్యం కూడా పంచ‌భూతాల సాక్షిగా న‌డిచే క‌థే. ఇందులో అనాథ‌గా న‌టిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇక ఇప్పుడు శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ కొత్త ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు బెల్లంకొండ‌. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ డైరెక్ట‌ర్ల వెంట ప‌డిన బెల్లంకొండ‌.. తొలిసారి భ‌యం వీడి కొత్త ద‌ర్శ‌కుడితో అడుగు వేస్తున్నాడు. మొత్తానికి చూడాలిక‌.. ఈ అల్లుడు జోరు ఇంకా ఎన్ని రోజులు ఇలా సాగ‌నుందో..? పాపం తొలి విజ‌యం ఎప్పుడు రానుందో..?

More Related Stories