English   

అల్లుడు శీను అదిరే స్పీడు

Bellamkonda-Sai-Srinivas

బెల్లంకొండ శ్రీనివాస్.. మాస్ హీరోగా ఎదగడమే టార్గెట్ గా స్క్రిప్టులు కదుపుతోన్న కుర్రాడు. ఫస్ట్ మూవీతో ఆకట్టుకుని ఆ తర్వాత ఒక్కో సినిమాతో ఎదుగుతూ వస్తోన్న శ్రీనివాస్ రీసెంట్ గా వచ్చిన జయజానకి నాయకతో పవర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించాడు. ఇక ఇప్పుడు సాక్ష్యం అనే థ్రిల్లర్ తో ఈ నెల 27న రాబోతున్నాడు. ఈ సినిమా పంచభూతాల చుట్టూ తిరిగే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్, టీజర్ ఆకట్టుకునేలా రూపొందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేశాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఆ సినిమాకు శ్రీనివాస్ దర్శకుడు. అది షూటింగ్ లో ఉండగానే ఇప్పుడు మరో సినిమా స్టార్ట్ చేసి అల్లుడు శీనుది అదిరే స్పీడు అని ప్రూవ్ చేస్తున్నాడు.

ఇవాళ బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. తేజ డైరెక్టర్. మళ్లీ కాజల్  అగర్వాల్ నే హీరోయిన్ గా తీసుకోవడం విశేషం. అంటే ఒకే కొత్త హీరోతో వరుసగా రెండు సినిమాలు చేస్తోందీ ముద్గుగుమ్మ. ఇక ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి వివి వినాయక్, సాక్ష్యం దర్శకుడు శ్రీవాస్ చీఫ్ గెస్ట్స్ గా వచ్చారు. ఇక ఇప్పటి వరకూ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలతో మంచి విజయాలు అందుకుంటోన్న అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ చందమామ శ్రీనివాస్ కు ఎలాంటి లక్ ఇస్తుందో చూడాలి. 

More Related Stories