English   

కుర్రాడ్ని చూస్తే ముచ్చ‌టేస్తోంది...

Bellamkonda Sreenivas
2018-02-21 17:13:46

హార్డ్ వ‌ర్క్ కు డెఫినేష‌న్ లాంటి కుర్రాడు బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్. వెన‌క తండ్రి స‌పోర్ట్ ఎంత ఉన్నా... అత‌ను ప‌డే క‌ష్టం కూడా భ‌లే అనిపిస్తుంది. యాక్టింగ్ లో ఇంకా మెరుగు కాలేదు. డిక్ష‌న్ లో ప‌ర్ఫెక్ష‌న్ లేదు. కానీ త‌న‌కంటూ ఓ ఇమేజ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ముందు నుంచీ యాక్ష‌న్ ఇమేజ్ కోసం ట్రై చేస్తోన్న శ్రీనివాస్ .. ఇక ట్రెండ్ మార్చే ప‌నిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నాడు. అందుకు తొలి సాక్ష్యం.. సాక్ష్యం సినిమానే. శ్రీవాస్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోన్న సాక్ష్యం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వ‌స్తోన్న విష‌యం ముందు నుంచీ అర్థ‌మౌతూనే ఉంది.

ఇక ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ మూవీకి సైన్ చేశాడీ బెల్లంకొండ కుర్రాడు. ఇన్నాళ్లు రామానాయుడు క్యాంప్ లో అసిస్టెంట్ గా పనిచేసిన  శ్రీనివాస్ అనే కుర్రాడు చెప్పిన క‌థ‌కు స్పెల్ బౌండ్ అయ్యాడ‌ట‌. అందుకే వెంట‌నే ఈ కొత్త కుర్రాడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డానికి సైన్ చేశాడు. సాయి ఓ కొత్త ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్. ఫ‌స్ట్ మూవీ వివి వినాయ‌క్ వంటి స్టార్ డైరెక్ట‌ర్ తో చేశాడు. త‌ర్వాత భీమినేని శ్రీనివాస్, బోయ‌పాటి శ్రీను, ఇప్పుడు శ్రీవాస్.. ముగ్గురూ ప్రూవ్డ్ డైరెక్ట‌ర్సే. అందుకే శ్రీనివాస్ కు త‌న ప‌ని సులువైంది. కానీ ఇప్పుడు చేయ‌బోతోన్న సినిమా అత‌ని కెరీర్ కు ఓ చాలెంజ్. ఇది పూర్తిగా త‌న ఇమేజ్ పైనే ఆధార‌ప‌డే సినిమా. దీని బిజినెస్ బెల్లంకొండ వారి అబ్బాయి రేంజ్ ను డిసైడ్ చేస్తుంది. ఏదేమైనా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవాల‌ని విప‌రీతంగా క‌ష్ట‌ప‌డుతోన్న శ్రీనివాస్ ను చూస్తుంటే భ‌లే ముచ్చ‌టేస్తోంది.

More Related Stories